'కరోనా వైరస్'.. ఉద్ధృతి తగ్గడం లేదు. తెలంగాణ వ్యాప్తంగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఐతే కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు తెలంగాణ సర్కారు అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.
కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి కట్టుబడి ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి లాక్ డౌన్ కూడా పొడగించారు. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ 2.0 కంటే మరో నాలుగు రోజులు అంటే మే 7 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రకటించారు. అంతే కాదు ఎలాంటి పాక్షిక సడలింపులు ఉండవని స్పష్టం చేశారు.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు మరో అడుగు ముందుకేసింది. ఇన్నాళ్లూ హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో క్రీడలకు సేవలు అందించిన గచ్చిబౌలి స్టేడియంను యుద్ధప్రాతిపదికన కరోనా దవాఖానగా మార్చారు. గత కొద్ది రోజుల నుంచి పనులు జరుగుతున్నాయి. గచ్చిబౌలి స్టేడియంను కరోనా దవాఖానగా మార్చుతున్నామని నిన్న (ఆదివారం) ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ .. ఇప్పుడు తెలంగాణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS)గా మారిపోయింది. ఇందులో 540 గదులు ఉన్నాయి. మొత్తం 15 అంతస్తుల భవనం ఇది. దీన్ని ఇప్పుడు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దారు. ఈ రోజు నుంచి ఇక్కడ కరోనా పాజిటివ్ రోగులకు చికిత్స అందిస్తారు.
15 వందల పడకల ఆస్పత్రి.. ఇప్పుడు అన్నిహంగులు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉంది. జీహెచ్ఎంసీ సిబ్బంది .. నిన్ననే ఆస్పత్రిని పూర్తిగా శుభ్రం చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..