Rajiv Swagruha Flats: రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లకు ఫుల్ డిమాండ్.. నేటి నుంచి లాటరీ పద్ధతిలో కేటాయింపు

Rajiv Swagruha Flats: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మించిన రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు వినియోగంలోకి రానున్నాయి.  బండ్లగూడ, పోచారంలో నిర్మించిన రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లను దరఖాస్తుదారులకు కేటాయించబోతోంది హెచ్ఎండీఏ. సోమవారం నుంచి లాటరీ పద్దతిలో ఫ్లాట్ల కేటాయింపు జరగనుంది.

Written by - Srisailam | Last Updated : Jun 27, 2022, 07:40 AM IST
  • రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లకు ఫుల్ డిమాండ్
  • 3,716 ఫ్లాట్లకు 39,082 దరఖాస్తులు
  • నేటి నుంచి లాటరీ పద్ధతిలో కేటాయింపు
Rajiv Swagruha Flats: రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లకు ఫుల్ డిమాండ్.. నేటి నుంచి లాటరీ పద్ధతిలో  కేటాయింపు

Rajiv Swagruha Flats: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మించిన రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు వినియోగంలోకి రానున్నాయి.  బండ్లగూడ, పోచారంలో నిర్మించిన రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లను దరఖాస్తుదారులకు కేటాయించబోతోంది హెచ్ఎండీఏ. సోమవారం నుంచి లాటరీ పద్దతిలో ఫ్లాట్ల కేటాయింపు జరగనుంది. ఇందు కోసం అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేశారు. ఫ్లాట్ల కేటాయింపు కోసం తీసే లాటరీ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. లాటరీ ప్రక్రియ మొత్తాన్ని యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌లో లైవ్‌ టెలికాస్ట్‌ చేయనున్నారు. ఈ ప్రక్రియను మొత్తం రికార్డ్‌ చేయనున్నారు. లాటరీలో ఎంపికైన దరఖాస్తుదారుడి పేరు, అతనికి కేటాయించి ఫ్లాట్ వివరాలను అధికారులు వెల్లడిస్తారు. ఫ్లాట్ల కేటాయింపునకు సంబంధించిన పూర్తి సమాచారం www.hmda.gov.in, www.swagruha. telangana.gov.in వెబ్‌సైట్‌లో ఈ నెల 29 సాయంత్రం నుంచి అందుబాటులో ఉంచుతామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.

బండ్లగూడ, పోచారంలో ఉన్న రాజీవ్ సృగృహ ఫ్లాట్ల అమ్మకానికి హెచ్ఎండీఏ నోటిఫికేషన్ ఇవ్వగా భారీ స్పందన వచ్చింది. ఆన్ లైన్ లో మొత్తం 3,716 ఫ్లాట్లకు 39,082 దరఖాస్తులు వచ్చాయి. బండ్లగూడలోని 2,246 ఫ్లాట్లను కొనేందుకు 33 వేల 161 దరఖాస్తులు వచ్చాయి. పోచారంలో 1,470 ఫ్లాట్ల కోసం 5,921 దరఖాస్తులు వచ్చాయి. వీటిని లాటరీ ద్వారా దరఖాస్తుదారులకు కేటాయిస్తారు. సోమవారం పోచారం ఫ్లాట్లను కేటాయిస్తారు. జూన్ 28 మంగళవారం బండ్లగూడలోని  ట్రిపుల్‌ బెడ్రూం డీలక్స్‌ ఫ్లాట్లు మినహాయించి మిగిలిన లాటరీ తీస్తారు. 29న బండ్లగూడలోని ట్రిపుల్‌ బెడ్రూం డీలక్స్‌ ఫ్లాట్లకు లబ్దిదారులను ఎంపిక చేస్తారు.

లాటరీ షెడ్యూల్, ఇతర వివరాలను రాజీవ్ స్వగృహ, హెచ్ఎండీఏ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ఒక వ్యక్తి ఒకే ఫ్లాట్‌కు అర్హుడని, రెండు ఫ్లాట్లు వస్తే ఒకటి రద్దు చేస్తామని అధికారులు చెప్పారు. లాటరీలో ఫ్లాట్‌ ను సొంతం చేసుకున్న వారు.. వారం రోజుల్లోగా 10 శాతం డబ్బులు కట్టాల్సి ఉంటుంది. రెండు నెలల్లో మిగిలిన 80 శాతం కట్టాలి. మిగిలిన 10 శాతం డబ్బులను 3 నెలల్లోగా చెల్లించాల్సి ఉంటుందని నోటిఫికేషన్ సమయంలో హెచ్ఎండీఏ ప్రకటించింది.

Read also: TS TET 2022: తెలంగాణ టెట్ ఫలితాల విడుదల వాయిదా.. అభ్యర్థుల్లో ఆందోళన

Read also: Telangana Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలపై వీడిన ఉత్కంఠ..28న ఫలితాలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News