Huzurabad bypoll: హుజూరాబాద్ ఉప ఎన్నిక పోటీలో నిలిచేదెవరో నేడు తేలనుంది

Huzurabad bypoll Withdrawal of nominations: హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో ప్రస్తుతం 42 మంది అభ్యర్థులు ఉన్నారు. నేటి వరకునామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. దీంతో ఈ రోజు ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 13, 2021, 09:00 AM IST
  • high
  • ఈ నెల 30న హుజురాబాద్ ఉప ఎన్నిక
  • 61 నామినేషన్లలో 19 తిరస్కరణ
  • ఎన్నికల బరిలో ప్రస్తుతం 42 మంది అభ్యర్థులు
  • నేటి వరకునామినేషన్ల ఉపసంహరణకు గడువు
Huzurabad bypoll: హుజూరాబాద్ ఉప ఎన్నిక పోటీలో నిలిచేదెవరో నేడు తేలనుంది

Huzurabad bypoll latest updates Withdrawal of nominations ends today: హుజురాబాద్ ఉప ఎన్నిక (Huzurabad bypoll) ఈ నెల 30న జరగనుంది. ఈ క్రమంలో అభ్యర్థులు ఇటీవల నామినేషన్లు వేశారు. తాజాగా అధికారులు వాటి పరిశీలన చేపట్టారు. 61 నామినేషన్లలో 19 తిరస్కరించారు. ఉప ఎన్నిక బరిలో ప్రస్తుతం 42 మంది అభ్యర్థులు ఉన్నారు. నేటి వరకునామినేషన్ల ఉపసంహరణకు (Withdrawal of nominations) గడువు ఉంది. దీంతో ఈ రోజు ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తారు. 

ఇక నామినేషన్ల ఘట్టంలో కీలకమైన గుర్తుల కేటాయింపుల ప్రక్రియ కూడా నేడు సాయంత్రం జరగనుంది. అలాగే ఇప్పటి వరకు ఉన్న 42 మంది అభ్యర్థుల్లో ఎంతమంది ఉపసంహరణ (Withdrawal) దిశగా అడుగులు వేస్తారనేది కూడా ఇవ్వాళ తేలనుంది. ఉపసంహరణకు ఇవాళ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉంది. ఈలోగా ఇదివరకే నామినేషన్‌ (nominations) వేసిన అభ్యర్థుల్లో ఎవరైనా పోటీ నుంచి తప్పుకోవాలంటే నేరుగా వచ్చి సంతకం పెట్టి నామపత్రాల్ని తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం టీఆర్‌‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి ముగ్గురితో పాటు 32 మంది స్వతంత్రులు, ఏడుగురు ఇతరపార్టీల సభ్యులు ఉప ఎన్నికల బరిలో ఉన్నారు.

Also Read : ZEEL-Invesco case: జీల్‌తో డీల్ విషయంలో Invesco మోసాన్ని బయట పెట్టిన Punit Goenka

పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య ఆధారంగా ఎన్ని ఈవీఎంలను (EVM) ఏర్పాటు చేయాల్సి వస్తుందోనని ఎన్నికల అధికారులు ఆలోచిస్తున్నారు. అలాగే బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకు ఇవాళ గుర్తులను కేటాయించనున్నారు. నామినేషన్లు  (nominations)  దాఖలు చేసే సమయంలోనే కొన్నింటిని వారు ఎంపిక చేసుకోగా ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అక్షర క్రమంలో అభ్యర్థుల పేర్లను బట్టి వారికి గుర్తులను కేటాయించనున్నారు.

ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికలో (Huzurabad bypoll) బీజేపి నుంచి ఈటల రాజేందర్ (Eetela Rajender) పోటీ చేస్తున్నారు. అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ (Gellu Srinivas Yadav), కాంగ్రెస్ పార్టీ తరఫున నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా తెలంగాణ విభాగం నాయకుడు బల్మూరి వెంకట్ (Balmoori Venkat) బరిలో ఉన్నారు.

Also Read : David Warner slams SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై డేవిడ్ వార్నర్ ఫైర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News