Attack On Zee Telugu: జీ మీడియా దాడిపై భగ్గుమన్న తెలంగాణ.. డీజీపీ, ప్రెస్‌ అకాడమీ, ఎంపీకి ఫిర్యాదులు

Journalists Meets To DGP Jitender Press Academy And Congress MP Anil Kumar: జీ తెలుగు న్యూస్‌తోపాటు మీడియా ప్రతినిధులపై జరుగుతున్న దాడులపై జర్నలిస్టు సంఘాలు ప్రభుత్వం దృష్టికితీసుకెళ్లాయి. డీజీపీ, ప్రెస్‌ అకాడమీ, కాంగ్రెస్‌ ఎంపీకి విన్నవించి కారకులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jul 11, 2024, 09:04 PM IST
Attack On Zee Telugu: జీ మీడియా దాడిపై భగ్గుమన్న తెలంగాణ.. డీజీపీ, ప్రెస్‌ అకాడమీ, ఎంపీకి ఫిర్యాదులు

Attack On Zee Telugu: విధి నిర్వహణలో ఉన్న జీ తెలుగు న్యూస్‌ ఛానల్‌ రిపోర్టర్‌ శ్రీచరణ్‌పై పోలీసుల దాడిని తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండించింది. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు, ప్రజా సంఘాలతోపాటు ప్రధాన రాజకీయ పార్టీలు ఖండించాయి. రాష్ట్రవ్యాప్తం అన్ని జిల్లా కేంద్రాల్లో జర్నలిస్టులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అయితే జీ తెలుగు మీడియాపై దాడిని ఖండిస్తూ డీజీపీకి, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌కు, అధికార పార్టీ ఎంపీకి జర్నలిస్టు సంఘాలు ఫిర్యాదు చేశాయి. దాడికి పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి.

డీజీపీకి ఫిర్యాదు
ఇటీవల డీజీపీగా బాధ్యతలు చేపట్టిన జితేందర్‌కు తొలి ఫిర్యాదు జర్నలిస్టు సంఘాలు ఇచ్చాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సీఐ రాజేందర్‌ జరిపిన దాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు డీజీపీని కోరారు. ఓయూలో రిపోర్టర్‌పై జరిగిన దాడి విషయాన్ని వివరించారు. ఓయూ పోలీసులు ఈడుకెళ్లిన వీడియోను డీజీపీకి చూపించారు. వారి ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన డీజీపీ హైదరాబాద్ కమిషనర్‌కు సిఫారసు చేశారు. జర్నలిస్ట్ శ్రీచరణ్‌పై దాడికి పాల్పడ్డ సీఐ రాజేందర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ భరత్, క్రైమ్ రిపోర్టర్స్, టీయూడబ్ల్యూజే (143), టీజేఎఫ్‌, హైందవ జర్నలిస్టులు కోరారు.

ఎంపీకి విజ్ఞప్తి
జీ తెలుగు మీడియాపై దాడిపై చర్యలు తీసుకోవాలంటూ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు గురువారం కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్‌ను కలిశారు. ఓయూలో శ్రీచరణ్ దాడి ఘటనపై ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా కొన్నాళ్లుగా హైదరాబాద్ పోలీసులు జర్నలిస్టులపై చేస్తున్న దాడుల విషయాన్ని వివరించారు. వెంటనే విచారణ జరిపి కారకులైన పోలీసులపై చర్యలు తీసుకునేలా హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌తో మాట్లాడుతానని ఈ సందర్భంగా జర్నలిస్టు ప్రతినిధులకు ఎంపీ అనిల్ హామీ ఇచ్చారు.

ప్రెస్‌ అకాడమీకి ఫిర్యాదు
జర్నలిస్టులపై దాడి విషయమై జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. జీ తెలుగు న్యూస్ ఎడిటర్ భరత్‌ కుమార్‌తో సహా అందరూ జర్నలిస్టులు ఘటన విషయాన్ని ఫిర్యాదు చేశారు. పోలీసుల దాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు ప్రతినిధులు కోరారు. శ్రీచరణ్ దాడి ఘటన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వినతి పత్రం ఇచ్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News