జాతీయ రాజకీయాల్లోకి వెళ్లను: కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం తన లక్ష్యమని.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.

Last Updated : Dec 30, 2017, 10:25 AM IST
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లను: కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం తన లక్ష్యమని.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. "ఇదివరకు ఢిల్లీ వెళ్ళినప్పుడు రాజ్నాథ్ సింగ్ ను కలిశాను. అప్పుడు ఆయన దేశంలో ఇదివరకెన్నడూ లేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని.. దీనిబట్టి చూస్తే మీరేమైనా జాతీయ రాజకీయాల్లో రావాలనుకుంటున్నారా? అని ప్రశ్నించగా నేను అలాంటిదేమీ లేదని చెప్పా" అని అన్నారు. 

రాజ్నాథ్ సింగ్ అలా అన్నప్పుడు నేను ఆశ్చర్యపోయానన్నారు. నాకు రాష్ట్ర ప్రజల సంక్షేమమే ముఖ్యమని.. ఆ లక్ష్యం దిశగా ముందడుగు వేస్తున్నామని చెప్పారు. దశాబ్దాల కల సాకారమైందని.. తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పారు. "రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలన్నది నా ఆకాంక్ష. దారిద్య్రరేఖను ప్రాలదోలేలా లక్ష్యం పెట్టుకొని పనిచేస్తాం" అని చెప్పారు. 

Trending News