K Kavitha First Speech: ఐదు నెలల తర్వాత తెలంగాణ నాయకురాలు, బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. 165 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైన కవిత బయటకు రాగానే భావోద్వేగానికి లోనయ్యారు. కనిపించిన తన కుమారుడు, భర్త అనిల్ కుమార్, సోదరుడు కేటీఆర్‌ను ఆలింగనం చేసుకుని రోదించారు. అనంతరం పార్టీ నాయకులకు అభివాదం చేసిన ఆమె వాహనంపై నుంచి ప్రసంగించారు. తాను తప్పు చేయలేదని మరోసారి స్పష్టం చేశారు. వడ్డీతో సహా చెల్లిస్తానని ప్రత్యర్థులకు హెచ్చరిక జారీ చేశారు.
Also Read: Kavitha Released: 164 రోజులకు బయటి లోకాన్ని చూసిన కవిత.. తిహార్ జైలు నుంచి విడుదల
సుప్రీంకోర్టు ఈడీ, సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేయడంతో మంగళవారం రాత్రి తిహార్ జైలు నుంచి కవిత విడుదలయ్యారు. మూడు నాలుగు గంటలసేపు కవిత కోసం నిరీక్షించారు. సరిగ్గా తొమ్మిది గంటల సమయంలో జైలు గేటు నుంచి బయటకు వచ్చారు. అనంతరం జైలు బయట ఉన్న కేటీఆర్, అనిల్, హరీశ్ రావును కవిత కన్నీటి పర్యంతమవుతూ ఆలింగనం చేసుకున్నారు.
Also Read: MLC Kavitha Case: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ to బెయిల్.. పూర్తి వివరాలు ఇవే..!
'నేను తెలంగాణ బిడ్డను.. కేసీఆర్ బిడ్డను. 18 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ వ్యక్తిగతంగా.. నాకు.. నా కుటుంబపరంగా ఒక తల్లిగా పిల్లలను వదిలి ఐదున్నర నెలలుగా ఉండడం ఇబ్బందికర విషయం. ఇటువంటి ఇబ్బందులకు నన్ను.. నా కుటుంబానికి కలిగించిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. ఇలాంటి కష్ట సమయంలో మాకు.. మా కుటుంబానికి తోడు నిలిచిన వారందరికీ హృదయపూర్వంగా పాదాభివందనం చేస్తున్నా.
'నేను తెలంగాణ బిడ్డను. నేను కేసీఆర్ బిడ్డను. నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని.. మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పని చేస్తాం. కమిట్‌మెంట్‌తో పని చేస్తాం. అందరితో నిలబడతానని చెబుతున్నా' అని కవిత సంచలన ప్రసంగం చేశారు.
నా తప్పు లేకున్నా.. కేవలం రాజకీయాల కోసం నన్ను జైల్లో పెట్టారు. ఈ విషయం దేశం మొత్తానికి తెలుసు.
నేను తెలంగాణ బిడ్డను.. కేసీఆర్ బిడ్డను.. తప్పు చేసే ప్రసక్తే లేదు.
రాజకీయంగా, న్యాయపరంగా పోరాడుతా.. తప్పకుండా నిర్దోషిగా నిరూపించుకుంటా.
- ఎమ్మెల్సీ @RaoKavitha pic.twitter.com/3RTl9uPaFS
— BRS Party (@BRSparty) August 27, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.