Prashanth Kishore Trs Survey: పీకే రిపోర్ట్.. టీఆర్ఎస్ కు 28 సీట్లు..!

Prashanth Kishore Trs Survey:తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారంతో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. పోటీపోటీగా జనంలోకి వెళుతున్నాయి. ప్రజల్లోకి వెళ్లడంతో పాటు తమ గెలుపోటములపై పార్టీలు సర్వేలు నిర్వహించుకుంటున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 3, 2022, 06:55 PM IST

    టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

    టీఆర్ఎస్ కు 28కి మించి సీట్లు రావని పీకే చెప్పాడు- పాల్

    ఓటమి భయంతోనే టీఆర్ఎస్ దాడులు- కేఏ పాల్

Prashanth Kishore Trs Survey: పీకే రిపోర్ట్.. టీఆర్ఎస్ కు 28 సీట్లు..!

Prashanth Kishore Trs Survey: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారంతో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. పోటాపోటీగా జనంలోకి వెళుతున్నాయి. సీఎం కేసీఆర్ సహా టీఆర్ఎస్ మంత్రులు జోరుగా జిల్లాలు చుట్టేస్తున్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ్ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ మే 6,7 తేదీల్లో తెలంగాణలో పర్యటించబోతున్నారు. ప్రజల్లోకి వెళ్లడంతో పాటు తమ గెలుపోటములపై పార్టీలు సర్వేలు నిర్వహించుకుంటున్నాయి. టీఆర్ఎస్ కోసం ఐ ప్యాక్ టీమ్ సర్వే చేస్తోంది. ఇప్పటికే సర్వే నివేదికలు కేసీఆర్ కు చేరాయని తెలుస్తోంది. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్ కూడా ఈ విషయం చెప్పారు.

తాజాగా తెలంగాణలో ఎన్నికల సర్వేకు సంబంధించి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు పాల్. తెలంగాణ పరిస్థితులకు సంబంధించి తాను ప్రశాంత్ కిషోర్ తో మాట్లాడానని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 28 సీట్ల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదని ప్రశాంత్ కిషోర్.. తనతో చెప్పారని కేఏ పాల్ తెలిపారు. ఎన్నికల నాటికి కారు పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందని జోస్యం చెప్పారు. అంతేకాదు ప్రశాంత్ కిషోర్ ను కొత్త పార్టీ పెట్టాలని కేసీఆర్ చెప్పారంటూ హాట్ కామెంట్స్ చేశారు కేఏ పాల్. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ నేతలు దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు.

కొన్ని రోజులుగా తెలంగాణలో విస్తృతంగా తిరుగుతున్నారు కేఏ పాల్. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ టార్గెట్ గా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం సిరిసిల్లా జిల్లాకు వెళుతుండగా.. సిద్ధిపేట జిల్లాలో కేఏ పాల్ పై దాడి జరిగింది. కేఏ పాల్ పోలీసులతో వాగ్వాదం చేస్తుండగా.. అనిల్ అనే వ్యక్తి అతని చెంప చెల్లుమనిపించాడు. ఈ ఘటన సంచనలం రేపింది. పాల్ పై దాడి చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తనపై దాడి చేసింది మంత్రి కేటీఆర్ అనుచరుడేనని పాల్ ఆరోపిస్తున్నారు. మంగళవారం మీడియా సమావేశం నిర్వహించిన పాల్.. టీఆర్ఎస్‌ పార్టీపై కీలక కామెంట్లు చేశారు.తనపై దాడి చేసిన వ్యక్తితో పోలీసులు బ్లూటూత్ లో మాట్లాడారని ఆరోపించారు. తెలంగాణలో పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారని కేఏ పాల్ మండిపడ్డారు.

READ ALSO: Rahul Night Club Video:రాహుల్ నైట్ క్లబ్ వీడియో.. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం..

Rahul Night Club Video: రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియో లీక్... నేపాల్‌లో ఎంజాయ్ చేస్తున్న కాంగ్రెస్ అగ్ర నేత..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News