Sai Chand's Wife Rajini: సాయిచంద్ భార్య రజినీకి కోటి రూపాయలు

KCR Gives Rs 1 Cr to Sai Chand's Wife Rajini: సాయిచంద్ కుటుంబానికి ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బీఆర్ఎస్ పార్టీ ఫండ్ నుంచి కోటిన్నర రూపాయిలు అందజేశారు. సాయిచంద్ కుటుంబానికి సిఎం కేసీఆర్ కన్నతండ్రిలా అండగా ఉంటారు అని డాక్టర్ దాసోజు శ్రవణ్ తెలిపారు.

Written by - Pavan | Last Updated : Aug 29, 2023, 06:45 AM IST
Sai Chand's Wife Rajini: సాయిచంద్ భార్య రజినీకి కోటి రూపాయలు

KCR Gives Rs 1 Cr to Sai Chand's Wife Rajini: సాయిచంద్ కుటుంబానికి ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బీఆర్ఎస్ పార్టీ ఫండ్ నుంచి కోటిన్నర రూపాయిలు అందజేశారు. సాయిచంద్ కుటుంబానికి సిఎం కేసీఆర్ కన్నతండ్రిలా అండగా ఉంటారు అని డాక్టర్ దాసోజు శ్రవణ్ తెలిపారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు మంత్రులు  సబితా ఇంద్రా రెడ్డి, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి , డాక్టర్ దాసోజు శ్రవణ్ , కట్టెల శ్రీనివాస్ యాదవ్ కలిసి పార్టీ తరపు నుండి ముఖ్యమంత్రి ప్రకటించిన కోటిన్నర రూపాయలలో కోటి రూపాయిల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును సాయిచంద్ భార్య రజిని సాయచంద్, కూతురు మినాల్, కొడుకు చరిష్ కు గుర్రంగూడాలోని వారి నివాసంలో కలిసి అందజేశారు.  

ఈ సందర్భంగా డాక్టర్ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లో నడిచిన దివంగత బిఆర్ఎస్ నేత సాయి చంద్ తన పాటతో తెలంగాణ ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న మహా కళాకారుడు. తన ఆట పాటతో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ అడుగులో అడుగుగా ప్రతి బహిరంగ సభల్లో తన ఆటాపాటతో బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యమయ్యారు. దురదృష్టవశాత్తు కాలం చేశారు అని అన్నారు. 

ఈ నేపధ్యంలో బాధ్యత గల తండ్రి స్థానంలో ఉన్న కేసీఆర్.. సాయి చంద్ కుటుంబాన్నిఆదుకునేందుకు ముందుకొచ్చారని దాసోజు శ్రవణ్ తెలిపారు. సాయిచంద్ కుటుంబానికి అండగా ఉంటూ సాయి చంద్ సతీమణి రజనీని వెంటనే గిడ్డంగుల కార్పోరేషన్ కు చైర్మన్ గా నియమించన విషయం తెలిసిందే. 

ఇది కూడా చదవండి : Minister Harish Rao: వాళ్లవన్నీ ఉత్తిత్తి డిక్లరేషన్.. మంత్రి హరీశ్ రావు సెటైర్లు

సాయి చంద్ ఇద్దర పిల్లల భవిష్యత్ బావుండాలి అనే సదుద్దేశంతో, కుటుంబానికి ఎలాంటి ఆర్ధిక ఇబ్బంది ఉండకూడని పార్టీ ఫండ్ నుంచి కోటిన్నర రూపాయిలు కేటాయిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మహబూబ్ నగర్ లో సాయి చంద్ తండ్రి, చెల్లమ్మకు ఎమ్మెల్యే సుమన్ వెళ్లి యాబై లక్షల రూపాయల చెక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కోటి రూపాయిల చెక్ ని సాయి చంద్ సతీమణి రజనీకి అంద జేయడం జరిగింది. భవిష్యత్ లో కూడా సాయి చంద్ కుటుంబానికి ఏ లోటు రాకుండా కేసీఆర్ కన్నతండ్రిలా ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ, నాయకులు, కార్యకర్తలు కూడా సాయి చంద్ కుటుంబానికి అండగా ఉంటాం’’ అని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : Revanth Reddy: తెలంగాణ గుండె చప్పుడు ఒక్కటే.. కేసీఆర్ ఖేల్ ఖతం-బీఆర్ఎస్ దుఖాన్ బంద్: రేవంత్ రెడ్డి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News