Yadadri: యాదాద్రిలో కేంద్రమంత్రులకు అవమానం.. కేసీఆర్ తో అట్లుంటది మరీ!

Yadadri: యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ ఆలయంలో మరోసారి ప్రోటోకాల్ వివాదం తలెత్తింది.కేంద్ర మంత్రులను ఆలయ ఈవో పట్టించుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను యాదాద్రి నుంచి ప్రారంభించారు

Written by - Srisailam | Last Updated : Aug 2, 2022, 04:36 PM IST
  • యాదాద్రిలో కేంద్రమంత్రికి అవమానం
  • కేంద్రమంత్రులు వచ్చినా కనిపించని ఈవో
  • యాదాద్రి ఈవో తీరుపై బీజేపీ నేతల ఫైర్
Yadadri: యాదాద్రిలో కేంద్రమంత్రులకు అవమానం.. కేసీఆర్ తో అట్లుంటది మరీ!

Yadadri: యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ ఆలయంలో మరోసారి ప్రోటోకాల్ వివాదం తలెత్తింది.కేంద్ర మంత్రులను ఆలయ ఈవో పట్టించుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను యాదాద్రి నుంచి ప్రారంభించారు. యాదాద్రిలో ఆలయంలో పూజల తర్వాత అక్కడే బహిరంగ సభ నిర్వహించారు. బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, కిషన్ రెడ్డి వచ్చారు. ఆ సందర్భంగా ఆలయంలో కేంద్రమంత్రులకు అవమానం జరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర పర్యాటక టూరిజం శాఖ మంత్రి  కిషన్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తదితర నాయకులు యాదాద్రి లక్ష్మినరసింహ స్వామి దర్శనానికి వచ్చారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం ఆలయ ఈవో గీతారెడ్డి కేంద్రమంత్రులను రిసీవ్ చేసుకోవాల్సి ఉండాగా ఆమె రాలేదు. ఆలయ అర్చకులే కేంద్రమంత్రులకు స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్రమంత్రులు వచ్చినా ఈనో గీతా రెడ్డి రాకపోవడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు వచ్చినప్పుడు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేసే ఈవో.. ఇద్దరు కేంద్రమంత్రులు వచ్చినా ఎందుకు రాలేదని కమలం నేతలు ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్ స్థానిక నేతలకు ఇచ్చిన మర్యాదలు కూడా ప్రతిపక్ష పార్టీల నేతలకు ఇవ్వడం లేదన్నారు.

గతంలో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ యాదాద్రి పర్యటనలోనూ ప్రోటోకాల్ వివాదం వచ్చింది. గవర్నర్ వచ్చినా ఆలయ ఈవో గీతారెడ్డి డుమ్మా కొట్టారు. ఈవో తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ ఆదేశాలతోనే గవర్నర్ పర్యటనకు యాదాద్రి ఆలయ ఈవో దూరంగా ఉన్నారనే విమర్శలు వచ్చాయి. ఆ ఘటన తర్వాత జిల్లా కలెక్టరేట్ ప్రోటోకాల్ విషయంలో అధికారులకు పక్కాగా ఆదేశాలు జారీ చేశారు. అయినా అధికారుల తీరు మారడం లేదనే ఆరోపఁలు వస్తున్నాయి. కేంద్రమంత్రులు వస్తున్నారని తెలిసే హుండి లెక్కింపు కార్యక్రమం చేపట్టారని.. ఇదంతా ఈవో కావాలనే చేశారని స్థానిక బీజేపీ నేతలు ఆరోపించారు.

Read also: Rare Seen: ఇది కలయా.. నిజమా! ఒకే వేదికపైకి జగన్, కేసీఆర్, చంద్రబాబు..

Read also: షూటింగ్స్ బంద్ పై మంచు మౌన వ్రతం.. మిగతా హీరోలు కూడా నోరు విప్పనిది అందుకేనా?

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News