Haritha Haram: సర్పంచ్ 85 శాతం మొక్కలను బతికించాల్సిందే..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. చెట్లను పెంచి సంరక్షించకపోతే భవిష్యత్‌లో ఆక్సిజన్ కొనుక్కోవాల్సి వస్తుందని తెలిపారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగుట్టలో జరిగిన హరితహారం కార్యక్రమంలో మొక్కను నాటారు.

Last Updated : Jul 8, 2020, 05:44 PM IST
Haritha Haram: సర్పంచ్ 85 శాతం మొక్కలను బతికించాల్సిందే..

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న (Haritha Haram) హరితహారం కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. చెట్లను పెంచి సంరక్షించకపోతే భవిష్యత్‌లో ఆక్సిజన్ కొనుక్కోవాల్సి వస్తుందని తెలిపారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగుట్టలో జరిగిన హరితహారం కార్యక్రమంలో మొక్కను నాటారు. ఈ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ ఇంటింటికి నీరు వచ్చే మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టామన్నారు. తెలంగాణలో అడవుల శాతాన్ని 33 శాతానికి పెంచడమే లక్ష్యం పెట్టుకున్నామని, ఇప్పటి వరకు 180 కోట్లకు పైగా మొక్కలు నాటామని, ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. 

Also Read: కోవిడ్‌పై యుద్ధమంటూ పాట రాసి.. కరోనాతోనే కన్నుమూసిన నిస్సార్

హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో పెట్టిన మొక్కల్లో 85 శాతం మొక్కలు బతకకపోతే సర్పంచ్ పదవి పోయేలా పంచాయతీరాజ్ చట్టం తెచ్చామన్నారు. అన్ని రకాల రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కరోనా సంక్షోభంలో కూడా పేదలు, రైతులకు సంబంధించిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందేలా ముందుకు తీసుకెళ్తున్నామని తెలియజేశారు. ఇకపై ప్రతి నెలా అన్ని గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రూ.338 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని మోతె ప్రాంతానికి సాగు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. 

Also Read: వికాస్ దుబేపై రివార్డు 5 లక్షలకు పెంపు.. పలు రాష్ట్రాల్లో అలర్ట్

 జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos

Trending News