కేటీఆర్ యంగ్ లుక్స్ ; 20 ఏళ్ల క్రితం ఆయన ఎలా ఉన్నారో తెలుసా ?

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సరికొత్త లుక్స్ లో చూసే ఛాన్స్ దొరికింది.

Updated: Aug 24, 2019, 08:08 AM IST
కేటీఆర్ యంగ్ లుక్స్ ; 20 ఏళ్ల క్రితం ఆయన ఎలా ఉన్నారో తెలుసా ?

43 ఏళ్ల వయసున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్ కేటీఆర్ 23 ఏళ్లలో ఏలా ఉన్నారో తెలుసా..?  దీని కోసం టైమ్ మిషన్ పెట్టుకొని 20 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదు. జస్ట్ కేటీఆర్ ట్విట్టర్ ఖాతా తెరిస్తే చాలు.. అంత ఓపిక లేదనిపిస్తే ఈ వార్త డీటైల్స్‌‌ లోకి వెళ్లండి.

ట్విట్టర్ వేదికపై కేటీఆర్ తన 20 ఏళ్లనాటి ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఓ ఫ్రెండ్ తో కలిసి  దిగిన 1999 నాటి ఫొటో ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు  పాత ఫోటో అయినప్పటికీ కేటీఆర్ ఎంతో యంగ్ లుక్ తో డైనమిక్ గా కనిపిస్తున్నారు. డెనిమ్ షర్టులో, మోడ్రన్ హెయిర్ స్టయిల్ తో ఉన్న కేటీఆర్ మరో ఫ్రెండ్ తో కలిసి దర్శనమిస్తున్నారు. ఎంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి మరి.