Seetharamula Kalyanam Live: సీతారాముల కల్యాణం చూతమురారండి.. లైవ్‌లో ఇక్కడ చూడండి

Bhadradri Ramayya Kalyanam Live Telecost: భద్రాచల దివ్యక్షేత్రంలో సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. రాములోరి కల్యాణం లైవ్‌లో ఇక్కడ చూడండి  

Written by - Ashok Krindinti | Last Updated : Apr 17, 2024, 11:57 AM IST
Seetharamula Kalyanam Live: సీతారాముల కల్యాణం చూతమురారండి.. లైవ్‌లో ఇక్కడ చూడండి
Live Blog

 

Bhadradri Ramayya Kalyanam Live Updates: భద్రాచలం పుణ్యక్షేత్రం మిథిలా స్టేడియంలో సీతారాముల కల్యాణ మహోత్సవం కనులపండువగా జరుగుతోంది. వేదపండితులు శాస్త్రోక్తంగా రాములోకి కల్యాణం నిర్వహిస్తున్నారు. ఈ మహాద్భుత ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. ఉదయం 9 గంటల నుంచి కల్యాణ మహోత్సం కార్యక్రమం జరుగుతోంది. 

 

17 April, 2024

  • 11:26 AM

    Seetharamula Kalyanam Live Updates: ఒంటిమిట్ట కోదండరాములవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంవైభవంగా జరుగుతున్నాయి. భక్త జనంతో ఒంటిమిట్ట పోటెత్తింది. దేశంలో అన్ని చోట్ల నవమి రోజు కల్యాణం జరుగుతుంది. కానీ ఇక్కడ పౌర్ణమి రోజున ఆరుబయట పండు వెన్నెలలో చంద్రుడు వీక్షించే విధంగా కల్యాణం నిర్వహిస్తారు. ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ప్రత్యేక పుష్పలతో ఆలయ మండపం ముస్తాబు చేశారు. ఇక్కడ జాంబవంతుని కాలంలో విగ్రహ ప్రతిష్ట జరిగింది. ఆంజనేయ స్వామి కనిపించని ఏకైక ఆలయం ఒంటిమిట్ట కావడం విశేషం.
     

  • 11:15 AM

     

    Ayodhya Ram Mandhir Kalyanam Live Telecost: అయోధ్యలో బాల రాముడి శ్రీరామ నవమి వేడుకలు లైవ్‌లో ఇక్కడ చూడండి.

     

  • 10:58 AM

    Ramayya Kalyanam Live Telecost: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభావంగా సీతారాముల వారి కల్యాణం జరుగుతోంది.
     

Trending News