Revanth Reddy Oath Ceremony Live: తెలంగాణ కొత్త మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే.. హోమ్ మంత్రి ఎవరంటే..?

Revanth Reddy Swearing-in Ceremony Live: తెలంగాణ రాష్ట్ర మూడో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం మరికాసేపట్లో జరగనుంది. ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డితోపాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం లైవ్‌ అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Written by - Ashok Krindinti | Last Updated : Dec 7, 2023, 04:41 PM IST
Revanth Reddy Oath Ceremony Live: తెలంగాణ కొత్త మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే.. హోమ్ మంత్రి ఎవరంటే..?
Live Blog

Telangana New CM Oath Ceremony Live Updates: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ మూడో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీ స్డేడియంలో రూట్‌మ్యాప్, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. స్డేడియంలో ఎవరు ఎటు నుంచి లోపలకు వెళ్లాలి..? నగరంలో ట్రాఫిక్ ఎటు మళ్లించారనే వివరాలు ఇప్పటికే పోలీసులు వెల్లడించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఎల్బీ స్డేడియం చుట్టుపక్కల 3 వేలమందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమ లైవ్‌ అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.

7 December, 2023

  • 16:41 PM
  • 15:26 PM

    Revanth Reddy Swearing Ceremony Live Updates: మంత్రులకు శాఖలు కేటాయించారు సీఎం రేవంత్ రెడ్డి. 

    ==> ఉత్తమ్-హోం మంత్రి
    ==> కోమటిరెడ్డి-మునిసిపల్  
    ==> శ్రీధర్ బాబు-ఆర్ధిక శాఖా
    ==> పొంగులేటి -నీటి పారుదల 
    ==> కొండా సురేఖ -మహిళా సంక్షేమం 
    ==> భట్టి - రెవెన్యూ 
    ==> దామోదర రాజనర్సింహ -మెడికల్ అండ్ హెల్త్ 
    ==> జూపల్లి -ఫౌర సరఫరాలు సీతక్క -గిరిజన సంక్షేమం 
    ==> తుమ్మల -రోడ్లు భవనాలు
    ==> కోమటిరెడ్డి - మునిసిపల్

     

  • 14:32 PM
  • 14:31 PM

    Revanth Reddy Swearing Ceremony Live Updates: తెలంగాణ ఎన్నో త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వ ఏర్పాటుతో తెలంగాణ మొత్తం అభివృద్ది చెందుతుందన్నారు. ప్రగతిభవన్ చుట్టు ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టించానని.. పదేళ్లబాధలను ప్రజలు మౌనంగా భరించారని అన్నారు. గత ప్రభుత్వం ప్రజల బాధలు పట్టించుకోలేదన్నారు. 

  • 14:28 PM

    Revanth Reddy Swearing Ceremony Live Updates: రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. 

     

  • 14:25 PM
  • 14:16 PM

    Revanth Reddy Swearing Ceremony Live Updates: ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలపై సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారు. రెండో సంతకం దివ్యాంగురాలు రజిని ఉద్యోగ నియామకంపై సంతకం చేశారు.

  • 14:03 PM

    Revanth Reddy Swearing Ceremony Live Updates: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి తొలి స్పీచ్ ఇలా..
     

  • 13:57 PM

    తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సమక్షంలో సీఎం, మంత్రుల ప్రమాణస్వీకారం ముగిసింది.
     

  • 13:50 PM

    Revanth Reddy Swearing Ceremony Live Updates: భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

  • 13:46 PM

    Revanth Reddy Swearing Ceremony Live Updates: తెలంగాణ మంత్రిగా జూపల్లి కృష్ణారావు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళసై ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
     

  • 13:44 PM

    Revanth Reddy Swearing Ceremony Live Updates: తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళసై ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
     

  • 13:42 PM

    Revanth Reddy Swearing Ceremony Live Updates: తెలంగాణ మంత్రిగా సీతక్క ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళసై ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
     

  • 13:40 PM

    Revanth Reddy Swearing Ceremony Live Updates: కొండా సురేఖ తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళసై ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

  • 13:38 PM

    Revanth Reddy Swearing Ceremony Live Updates: తెలంగాణ మంత్రిగా పొన్న ప్రభాకర్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళసై ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
     

  • 13:36 PM

    Revanth Reddy Swearing Ceremony Live Updates: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళసై ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
     

  • 13:33 PM

    Revanth Reddy Swearing Ceremony Live Updates: దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళసై ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
     

  • 13:31 PM

    Revanth Reddy Swearing Ceremony Live Updates: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళసై ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

  • 13:30 PM

    Revanth Reddy Swearing Ceremony Live Updates: తెలంగాణ మంత్రి దామోదరం నర్సింహ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళసై ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
     

  • 13:28 PM

    Revanth Reddy Swearing Ceremony Live Updates: ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. గవర్నర్ తమిళసై ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
     

  • 13:25 PM

    Revanth Reddy Swearing Ceremony Live Updates: భట్టి విక్రమార్క మల్లు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళసై ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

  • 13:23 PM

    Revanth Reddy Swearing Ceremony Live Updates: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళసై రేవంత్ రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

  • 13:17 PM
  • 13:11 PM

    Revanth Reddy Swearing Ceremony Live Updates: సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియానికి చేరుకున్నారు. గవర్నర్ తమిళసై రేవంత్ రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

     

  • 13:02 PM

    Revanth Reddy Swearing Ceremony Live Updates: రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి జనం పోటెత్తారు. ఎల్బీ స్టేడియం ప్రజలతో నిండిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

  • 12:51 PM
  • 12:47 PM

    Revanth Reddy Swearing Ceremony Live Updates: హోటల్ తాజ్‌కృష్ణా నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్‌ గాంధీ బయలుదేరారు. మరికాసేపట్లో ఎల్బీ స్టేడియానికి చేరుకోనున్నారు.

  • 12:30 PM

    Revanth Reddy Swearing Ceremony Live Updates: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ పేరు ఖరారైంది. వికారాబాద్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఉమ్మడి ఏపీలో గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రిగా పని చేశారు. ఆయన స్వగ్రామం వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం బెల్కటూర్.

  • 12:16 PM
  • 12:12 PM

    Revanth Reddy Swearing Ceremony Live Updates: సీఎం పదవిపై మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను సీఎం పదవి ఆశించిన మాట వాస్తవమేనన్నారు. కానీ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవన్న భట్టి.. పదవులు దక్కడం అసాధ్యం అన్నారు.

  • 11:39 AM
  • 11:21 AM

    Revanth Reddy Swearing Ceremony Live Updates: తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని.. ప్రజల కష్టాలు తీరబోతున్నాయని భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేసిన తాను.. ప్రజల కష్టాలు దగ్గరగా చూశానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో అందరం సమష్టిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. గత పదేళ్లలో అధికార బీఆర్ఎస్ ప్రజలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. 

  • 11:09 AM

    Revanth Reddy Swearing Ceremony Live Updates: ప్రమాణ స్వీకారానికి ముందు కుటుంబ సభ్యులతో కలిసి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లి దేవాలయానికి వెళ్లనున్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనతరం అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియానికి రానున్నారు. మార్గమధ్యలో గన్‌పార్కు వద్ద అమరవీరుల స్తూపానికి కాబోయే ముఖ్యమంత్రి నివాళులు అర్పించనున్నారు. మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం ఉంటుంది. 

  • 11:04 AM

    Revanth Reddy Swearing Ceremony Live Updates: రేవంత్ రెడ్డి కేబినెట్‌లో 11 మందికి చోటు దక్కింది. అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించేలా మంత్రివర్గ కూర్పు జరిగినట్లు తెలుస్తోంది. మంత్రుల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 11:00 AM

    Revanth Reddy Swearing Ceremony Live Updates: తెలంంగాణ తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా, రాష్ట్ర మూడవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మరి కాస్సేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టి అతిరథ మహారథులు పాల్గొంటున్ననేపథ్యంలో ఎల్బీ స్డేడియంలో భారీగా ఏర్పాట్లు, బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

     

Trending News