/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

'కరోనా వైరస్' అందరి సమస్య అని..అందుకే అందరూ ఐకమత్యంగా కలిసి పోరాడాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. సిద్ధిపేట జిల్లా కరోనా ఫ్రీ అయిందని.. ఎవరూ బాధ్యత  మరిచిపోవద్దని కోరారు. లాక్ డౌన్ పూర్తయ్యే వరకు ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని కోరారు. అలాగే ముస్లింలు ఇళ్లల్లోనే ఉండి నమాజ్ చేసుకోవాలని కోరారు.

పేద ముస్లింలకు ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా  పంపిణీ చేశారు మంత్రి హరీశ్ రావు. సిద్ధిపేట ముర్షద్ గడ్డలో ఈ కార్యక్రమం జరిగింది. ముస్లింలకు నిత్యావసర వస్తువుల కిట్స్, ప్రతి ఒక్కరికీ 500 రూపాయల నగదును పంపిణీ చేశారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో పని లభించక దినసరి కూలీలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్ రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యం, 1500 రూపాయల నగదు అందించి ఏప్రిల్ నెలలో ఆదుకున్నారని తెలిపారు. అలాగే వచ్చే మే నెలలో కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 

 సర్వ మానవాళి క్షేమం కోసం ముస్లింలు ప్రార్థనలు చేయాలని హరీష్ రావు కోరారు. రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ఉపవాసం ఉన్న మీరు..  రాష్ట్ర, దేశ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని అల్లాను ప్రార్థించాలన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ఇంట్లోనే నమాజ్ చేయాలని హితవు పలికారు. సిద్ధిపేటలోని అర్హులైన ముస్లింలందరికీ రంజాన్ తోఫా అందేలా ఏర్పాట్లు చేయిస్తానని భరోసా ఇచ్చారు మంత్రి. ప్రభుత్వ ఆదాయం తగ్గినా... కరోనా నేపథ్యంలో విపత్కర పరిస్థితి వచ్చినా పేదలను ఆదుకునేందుకు సంక్షేమానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం ముందుందని తెలిపారు.  

కరోనా అందరి సమస్య మనమంతా ఐక్యంగా కలిసి కరోనాపై పోరాడదామని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. కరోనా మనిషిలో ప్రవేశించేది గొంతులోకి, ఆ తర్వాత అవయవాలపై వైరస్ దాడి చేస్తుందని తెలిపారు. ఇందు కోసం ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుచి, శుభ్రత అలవాటు చేసుకుని వేడి నీరు తాగాలన్నారు.  జలుబు చేస్తే ఆవిరి పట్టినట్లు, పసుపు వేసి ఆవిరి పట్టాలని చెప్పారు.  శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచే ఆహారాన్ని తీసుకోవాలని మంత్రి సూచించారు. మాకేం అవుతుంది. ఏం కాదులే అనే నిర్లక్ష్యం వద్దని చెప్పారు. అలాగే అనవసరంగా బయట తిరగొద్దన్నారు. ఇంటి వాళ్లకు కరోనాను అంటించొద్దని  కోరారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Section: 
English Title: 
Minister Harish rao comments on coronavirus and lockdown during ramadan Thofa distribution
News Source: 
Home Title: 

లాక్ డౌన్ ముగిసినా బాధ్యత మరవద్దు..!!

లాక్ డౌన్ ముగిసినా బాధ్యత మరవద్దు..!!
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
లాక్ డౌన్ ముగిసినా బాధ్యత మరవద్దు..!!
Publish Later: 
No
Publish At: 
Thursday, April 30, 2020 - 14:47