హైదరాబాద్ నగరాన్ని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా నేడు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే.తారక రామారావు జీహెచ్ ఎంసీ పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నియోజకవర్గాలలో పర్యటించారు. నగరంలోని శిల్పారామం ఎదుట జీహెచ్‌ఎంసీ కొత్తగా నిర్మించిన ఏసీ బస్‌స్టాప్‌ను కేటీఆర్ ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా ఏసీ బస్టాప్‌ను ఏర్పాటు చేసి జీహెచ్‌ఎంసీ అరుదైన ఘనత సాధించింది. స్థానికంగా లగ్జరీ వాష్‌రూం, లూ కేఫ్‌నూ ప్రారంభించారు.
అంతేకాకుండా అయ్యప్ప సొసైటీ వద్ద జలమండలి ఆధ్వర్యంలో నిర్మించిన రిజర్వాయర్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాల సందర్భంగా మాదాపూర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
దేశంలోనే తొలి ఏసీ బస్ స్టాప్