ఉత్తమ్‌కు మంత్రి తలసాని వార్నింగ్!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై, నగర కమిషనర్ అంజనీకుమార్‌పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఘాటుగా స్పందించారు. మంత్రి తలసాని శనివారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తమ్‌ కుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Last Updated : Dec 29, 2019, 12:10 AM IST
ఉత్తమ్‌కు మంత్రి తలసాని వార్నింగ్!

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై, నగర కమిషనర్ అంజనీకుమార్‌పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఘాటుగా స్పందించారు. మంత్రి తలసాని శనివారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తమ్‌ కుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో కల్వకుంట్ల పోలీస్ సర్వీస్ నడుస్తోందని.. సీఎం కేసీఆర్ ఎలా చెబితే పోలీసులు అలా వింటున్నారని వ్యాఖ్యానించడంతో పాటు నగర కమిషనర్‌పై ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టిన తలసాని.. సీపీపై ఉత్తమ్‌ చేసిన విమర్శలు ఆయన రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. ఒక నిబద్ధతతో విధులు నిర్వహించే పోలీస్ అధికారులపై రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేయడం ఉత్తమ్‌ కుమార్ రెడ్డికి తగదని మంత్రి తలసాని హితవు పలికారు. 

ఈ సందర్భంగా ఉత్తమ్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసిన మంత్రి తలసాని.. గతంలో కాంగ్రెస్‌ సభలు, సమావేశాలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదా ? అది ఆలోచించరా అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ర్యాలీకి అనుమతించ మాత్రాన్నే పోలీసులను ఇష్టమొచ్చిన మాటలు అంటే ఎలా’ అని మంత్రి తలసాని ఘాటుగా స్పందించారు. ఇకనైనా ఉత్తమ్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని మంత్రి తలసాని హెచ్చరించారు.
 

Trending News