Munugode Bypoll: కాంగ్రెస్ కార్యాలయం దగ్ధం.. మునుగోడులో కలకలం.. రేవంత్ రెడ్డి రాకతో హై టెన్షన్

Munugode Bypoll: చండూరు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తగలబడటం కలకలం రేపుతోంది. సోమవారం అర్ధరాత్రి తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆఫీసు లోపల ఉన్న పార్టీ జెండాలు తగలబడ్డాయి.

Written by - Srisailam | Last Updated : Oct 11, 2022, 11:15 AM IST
  • మునుగోడులో టెన్షన్ టెన్షన్
  • చండూరు కాంగ్రెస్ కార్యాలయానికి నిప్పు
  • చండూరులో రేవంత్ రెడ్డి టూర్
 Munugode Bypoll:  కాంగ్రెస్ కార్యాలయం దగ్ధం.. మునుగోడులో కలకలం.. రేవంత్ రెడ్డి రాకతో హై టెన్షన్

Munugode Bypoll:  హోరాహోరీ పోరు సాగుతున్న మునుగోడు నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. చండూరు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తగలబడటం కలకలం రేపుతోంది. సోమవారం అర్ధరాత్రి తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆఫీసు లోపల ఉన్న పార్టీ జెండాలు తగలబడ్డాయి. ఉదయం గమనించిన కాంగ్రెస్ నేతలు.. పార్టీ పెద్దలకు సమాచారం ఇచ్చారు. అగ్గి ప్రమాదం బయటి వ్యక్తులు చేసిన పనా లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా ఎటు తేల్చుకోలేకపోతున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. రాజకీయ కారణాలతోనే ఎవరో మంట పెట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సోమవారం రాత్రే చండూరులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి. వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం బీజేపీకి రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోయారని ఆ పోస్టర్లలో ఆరోపించారు. ట్రాన్సక్షన్‌ ఐడి పేరుతో బీజేపీ 18వేలకోట్లు అంటూ పోస్టర్లలో రాశారు.  రూ.500కోట్ల బోనస్ అని రివార్డ్‌ గా చూపించారు. Phone Pay తరహాలో Contract Pe, 18000 కోట్లు Transaction కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కు కేటాయించడం జరిగిందని వందల సంఖ్యలో గోడలకు రాత్రికి రాత్రి అంటించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంట్రాక్ట్ పే పోస్టులు వెలిసిన కొన్ని గంటల్లోనే కాంగ్రెస్ కార్యాలయంలో మంటలు రావడం సంచలనంగా మారింది.

మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణకు చూసి ఓర్వలేకనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని హస్తం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మంగళవారం చండూరులో పర్యటించనున్నారు. రేవంత్ రెడ్డి పర్యటనను డిస్ట్రబ్ చేయడానికే పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టారని మండిపడుతున్నారు. చండూరు కార్యాలయంలో మంటలు రావడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ దిమ్మెలు కూల్చినా, పార్టీ కార్యాలయాలు తగులబెటినా.. మునుగోడు గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి దుర్మార్గపు చర్యలతో కాంగ్రెస్ గెలుపును ఆపలేరన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

Also Read: Munugode Posters: ఫోన్ పే తరహాలో కాంట్రాక్ట్ పే.. మునుగోడులో పోస్టర్ల కలకలం 

Also Read: Munugode Bypoll: కారెక్కిన కర్నాటి.. అదే బాటలో తాడూరి! మునుగోడుపై ప్రగతి భవన్ నుంచి ఆపరేషన్.. కమలంలో కలకలం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News