రైతుబంధుకు ఆ నిబంధనలు తప్పనిసరి.. కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకానికి స్వల్ప నిబంధనలు జారీ చేసింది. అయితే ప్రభుత్వం చెప్పిన రకం పంటలు సాగు చేసిన రైతులకే రైతు బంధు ఇస్తామని సీఎం కేసీఆర్‌ మరోసారి స్పష్టం చేశారు. 

Last Updated : May 13, 2020, 12:07 AM IST
రైతుబంధుకు ఆ నిబంధనలు తప్పనిసరి.. కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకానికి స్వల్ప నిబంధనలు జారీ చేసింది. అయితే ప్రభుత్వం చెప్పిన రకం పంటలు సాగు చేసిన రైతులకే రైతు బంధు ఇస్తామని సీఎం కేసీఆర్‌ మరోసారి స్పష్టం చేశారు. పంట మార్పిడి, క్రాప్ కాలనీల ఏర్పాటుపై సమీక్షించిన సీఎం సూచించిన పంటలు వేస్తేనే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తామని, అందరూ ఒకే పంట వేసే విధానం పోవాలని, కేవలం డిమాండ్‌ ఉన్న పంటలనే సాగు చేయాలని తెలిపారు.

రాష్ట్రంలో ఈసారి 50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని, రైతులకు లాభం చేయాలనే ఏకైక లక్ష్యంతోనే నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ వర్షాకాలంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి, 10 లక్షల ఎకరాల్లో కందులు పట్టణ ప్రాంతాలకు సమీపంలో కూరగాయల సాగు చేయించాలని, ప్రభుత్వం నిర్ణయించిన పంటలకు సంబంధించిన విత్తనాలు మాత్రమే లభ్యమయ్యేలా విత్తన నియంత్రణ అథారిటీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నకిలీ, కల్తీ విత్తనాలు అమ్మే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, నియంత్రిత పద్ధతిలో పంట సాగుపై సూచనలు చేసేందుకు ఈ నెల 15న క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్. రైస్‌ మిల్లుల సామర్థ్యం బాగా పెరగాల్సి ఉందని సీఎం కేసీఆర్ అన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News