ఎంపీటీసి, జడ్పీటీసీ తొలి విడత ఎన్నికలకు నేడే నోటిఫికేషన్

ఎంపీటీసి, జడ్పీటీసీ తొలి విడత ఎన్నికలకు నేడే నోటిఫికేషన్

Updated: Apr 22, 2019, 11:03 AM IST
ఎంపీటీసి, జడ్పీటీసీ తొలి విడత ఎన్నికలకు నేడే నోటిఫికేషన్
Representational image

హైదరాబాద్: తెలంగాణలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలివిడత ఎన్నికలకు నేడు నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నేటి నుంచి 24వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 25న నామినేషన్స్ పరిశీలన, 26న అభ్యంతరాల స్వీకరణ, 26 నుంచి 28వ తేదీ వరకు నామినేషన్స్ ఉపసంహరణకు వీలు కల్పించారు. మే 6న తొలి విడత పోలింగ్‌ జరగనుంది. మే 27న ఫలితాలు వెల్లడి కానున్నాయి. 

ఇదిలావుంటే, మరోవైపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు అందించాల్సి వున్న బీ-ఫారంలను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అందజేసే పనిలో టీఆర్‌ఎస్ నిమగ్నమైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే చేతికి సైతం టీఆర్ఎస్ ఈ బీ-ఫారంలు అందజేసినట్టు తెలుస్తోంది.