పాత ఫోన్ నంబర్ తెచ్చిన తిప్పలు..యువతి ఖాతా నుంచి రూ.7 లక్షలు మాయం

భాగ్యనగరంలో కొత్త తరహా సైబర్ మోసం జరిగింది. ఓ యువతి వాడిపడేసిన పాత ఫోన్ నంబర్ ను ఓ సెల్యులార్ సంస్థ మరొకరికి కేటాయించగా ఆమె ఖాతా నుంచి  రూ. 7 లక్షలు మాయం అయ్యాయి. బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Last Updated : Jul 18, 2018, 03:58 PM IST
పాత ఫోన్ నంబర్ తెచ్చిన తిప్పలు..యువతి ఖాతా నుంచి రూ.7 లక్షలు మాయం

హైదరాబాద్: భాగ్యనగరంలో కొత్త తరహా సైబర్ మోసం జరిగింది. ఓ యువతి వాడిపడేసిన పాత ఫోన్ నంబర్ ను ఓ సెల్యులార్ సంస్థ మరొకరికి కేటాయించగా ఆమె ఖాతా నుంచి  రూ. 7 లక్షలు మాయం అయ్యాయి. బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

పోలీసుల కథనం ప్రకారం..యువతి వాడిపడేసిన మొబైల్ నంబర్ ను సెల్యులార్ నెట్ వర్క్ సంస్థ వేరే వ్యక్తికి ఇచ్చింది. అతను తన స్మార్ట్ ఫోన్ లో దాన్ని వేసుకుని పలు రకాల యాప్స్ డౌన్ లోడ్ చేసుకోగా.. ఆమె బ్యాంకు ఖాతా వివరాల నుంచి పిన్ నంబర్ వరకూ అన్ని వివరాలు వచ్చేశాయి. తలుపుతట్టి మరి వచ్చిన అదృష్టాన్ని ఎవరైనా వదులుకుంటారా చెప్పండి !!...ఏ మాత్రం ఆసల్యం చేయకుండా వాటిని వాడుకుని రూ. 7 లక్షలు విత్ డ్రా చేసుకున్నాడు. 

బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు లేకపోవడాన్ని గుర్తించిన ఆ యువతి షాక్ కు గురైంది. వెంటనే విషయాన్ని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి నుంచి ఫిర్యాదను స్వీకరించిన పోలీసులు.. సదరు వ్యక్తిని గుర్తించే పనిలో పడ్డారు. బ్యాంకుకు ఆ మొబైల్ నంబర్ అనుసంధానం చేసి ఉండటం.. సిమ్ వాడిపడేసిన తర్వాత ఆమె చేసిన చిన్నపాటి నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఇలా జరిగిందని..కాబట్టి బ్యాంకు ఖాతాలకు ఫోన్ నంబర్ల అనుసంధానం పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

మనలో చాలా మంది తెలిసో తెలీకో ఈ యువతి చేసిన తప్పిదమే చేస్తుంటాం. బ్యాంకు ఖాతాలకు ఫోన్ నంబర్లు అనుసంధానం పట్ల అంతగా దృష్టి సారించం. చిన్న పాటి నిర్లక్ష్యం వల్ల ఆమె లక్షలు పొగొట్టుకోవాల్సి వచ్చింది.. కాబట్టి మనం కూడా యువతి చేసిన తప్పిదాన్ని చేయకుండా జాగ్రత్త పడదామా మరి..

Trending News