Chanchalguda Jail Prisoner: అది కడుపేనా.. కిరాణం కొట్టా.. ఖైదీ కడుపులో మేకులు, గంజాయి పొట్లాలు..!

Metal In Prisoner Stomach: చంచల్‌గూడ జైలులోని ఓ ఖైదీ చేసిన నిర్వాకం ఇటు పోలీసులు.. అటు వైద్యులను ఉరుకులు పరుగులు పెట్టించింది. మేకులు, రబ్బరు మూతలు, ప్లాస్టిక్ పొట్లాలు మింగి.. తీవ్రమైన కడుపు నొప్పితో ఇబ్బందిపడ్డాడు. ఎండోస్కోపి ద్వారా ఉస్మానియా వైద్యులు వాటిని బయటకు తీశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 10, 2024, 01:27 PM IST
Chanchalguda Jail Prisoner: అది కడుపేనా.. కిరాణం కొట్టా.. ఖైదీ కడుపులో మేకులు, గంజాయి పొట్లాలు..!

Metal In Prisoner Stomach: రెగ్యులర్‌గా తినే ఆహారం కంటే.. కాస్త ఎక్కువ తింటేనే కడుపులో ఏదో తేడా కొడుతుంది. అలాంటిది ఓ ఖైదీ ఏకంగా మేకులు, రబ్బరు మూతలు, గంజాయి పొట్లాలను మింగేశాడు. తీరా కడుపు నొప్పి తాళలేక విలవిలపోయాడు. జైలు అధికారులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా.. స్కానింగ్ తీశారు వైద్యులు. స్కానింగ్ రిపోర్టులు చూసి వైద్యులు, జైలు అధికారులు షాక్‌కు గురయ్యారు. ఎండోస్కోపి ద్వారా ఖైదీ కడుపులో నుంచి మేకులు, రబ్బరు మూతలతోపాటు గంజాయి పొట్లాలుగా భావిస్తున్న రెండు ప్లాస్టిక్ కవర్ ప్యాకెట్లను వైద్యులు బయటికి తీశారు. వివరాలు ఇలా..

చంచల్ గూడ జైలులో ఖైదీగా మహ్మద్ సోహేల్ (21) అనే ఖైదీ తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో జైలు అధికారులు వైద్య పరీక్షలు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఖైదీకి స్కానింగ్ తీయగా.. కడుపులో రెండు మేకులు ఉన్నట్టు గుర్తించారు. ఆ మేకులను రెండు రోజుల క్రితం మింగినట్లు తెలిసింది. మంగళవారం ఎండోస్కోపి ద్వారా అతని కడుపులోని మేకులను వైద్యులు బయటకి తీశారు.

మరోసారి స్కానింగ్ తీయగా.. ఇంకా రెండు రబ్బరు మాతలు, రెండు ప్యాకెట్లు ఉన్నట్లు తేలింది. వాటిని కూడా ఎండోస్కోపీ ద్వారా బయటకి తీసేశారు. ప్లాస్టిక్ ప్యాకెట్లలో గంజాయి ఉందనే అనుమానంతో వాటిని ల్యాబ్‌కు చ౦పించారు. ఎలాంటి శస్త్రచికిత్స చేయకుండానే ఎండోస్కోపి ద్వారా రోగి ప్రాణాలను కాపాడిన గ్యాస్టో ఎంట్రాలజీ విభాగం హెచ్‌వోడీ డాక్టర్ బి.రమేశ్ బృందాన్ని ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ అభినందించారు.

Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు

Also Read: Home Loan Rates: హోమ్‌ లోన్స్‌ గుడ్‌ న్యూస్‌..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News