Pangolin scales: తెలంగాణ టు చైనా పంగోలిన్ పొలుసుల స్మగ్లింగ్

పంగోలిన్ జంతు చర్మంతో పాటు చర్మంపై ఉండే పొలుసులకు (అలుగు పొలుసులు) జాతీయ, అంతర్జాతీయ బ్లాక్ మార్కెట్లలో భారీ డిమాండ్ ఉండటంతో వాటిని వేటాడి, పొలుసులను స్మగ్లింగ్ ( Pangolin scales smuggling ) చేస్తోన్న ఓ అంతరాష్ట్ర ముఠాను తెలంగాణ అటవీ శాఖ సినీ ఫక్కీలో వెంటాడిపట్టుకుంది.

Last Updated : Aug 3, 2020, 11:59 PM IST
Pangolin scales: తెలంగాణ టు చైనా పంగోలిన్ పొలుసుల స్మగ్లింగ్

హైదరాబాద్: పంగోలిన్ జంతు చర్మంతో పాటు చర్మంపై ఉండే పొలుసులకు (అలుగు పొలుసులు) జాతీయ, అంతర్జాతీయ బ్లాక్ మార్కెట్లలో భారీ డిమాండ్ ఉండటంతో వాటిని వేటాడి, పొలుసులను స్మగ్లింగ్ ( Pangolin scales smuggling ) చేస్తోన్న ఓ అంతరాష్ట్ర ముఠాను తెలంగాణ అటవీ శాఖ సినీ ఫక్కీలో వెంటాడిపట్టుకుంది. భద్రాచలం అటవీ ప్రాంతంలో గిరిజనులకు ఓ అంతరాష్ట్ర ముఠా డబ్బు ఆశ చూపి ఈ పంగోలిన్ జంతు చర్మాలను సేకరించి, స్మగ్లింగ్‌కి పాల్పడుతోందని స్పష్టమైన సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు.. వారం రోజుల పాటు అండర్ కవర్ ఆపరేషన్‌ చేసి స్మగ్లింగ్ ముఠాను పట్టుకున్నారు. అటవీ శాఖ అధికారులే కొనుగోలుదారుల అవతారం ఎత్తి స్మగ్లర్లను సంప్రదించారు. Also read: Rakhi festival: రాఖి పౌర్ణమి నాడే మహిళలకు మరో కానుక

అటవీ శాఖ అధికారులను గుర్తించని స్మగ్లర్ల ముఠా.. వారితో సంప్రదింపులు, భేరసారాలు జరిపేందుకు ముందుకొచ్చింది. దీంతో అదును చూసుకున్న అధికారులు.. మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. అటవీ శాఖ ప్రధాన కార్యాలయం అరణ్య భవన్ నుంచి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో కిన్నెరసాని వైల్డ్ లైఫ్ ఎఫ్ డీ ఓ దామోదర్ రెడ్డి, హైదరాబాద్ విజిలెన్స్ డీఎఫ్ఓ రాజారమణారెడ్డి, ఇతర అధికారులు, ఇతర సిబ్బంది ఈ అండర్ కవర్ ఆపరేషన్‌లో పట్టుకున్నారు. Also read: Director Teja: తేజకు కరోనా పాజిటివ్

హైదరాబాద్‌తో సహా కొత్తగూడెం, భద్రాచలం, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ స్మగ్లర్ల ముఠా ఆపరేషన్స్ కొనసాగిస్తున్నట్టు తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు.. ఆయా రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్ నిర్వహించారు. బాదావత్ రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అతడు ఇచ్చిన సమాచారంతో మూడు రోజుల పాటు హైదరాబాద్ సహ వివిధ ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు నిఘా పెట్టి అతి చాకచక్యంగా సునీల్, నాగరాజు అనే కీలక నిందితులతో పాటు మరో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లర్లపై అటవీ, వన్యప్రాణుల సంరక్షణ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి పోలీసుల సహకారంతో కొత్తగూడెం మెజిస్ట్రేట్ ఎదుట నిందితులను హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు నిందితులను రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం నిందితులు ఖమ్మం సబ్ జైల్‌లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ ముఠాకు చెందిన మరో ముగ్గురి ఆచూకీ లభించాల్సి ఉందని.. త్వరలోనే వాళ్లను కూడా పట్టుకుంటామని అధికారులు తెలిపారు. పంగోలిన్ పొలుసులను స్మగ్లింగ్ చేస్తోన్న ఈ అంతరాష్ట్ర ముఠాలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన స్మగ్లర్లకు సంబంధాలు ఉన్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. Also read: Shashi Tharoor: హోంమంత్రి షా ఎయిమ్స్‌లో ఎందుకు చేరలేదో..

Pangolin scales smuggling పంగోలిన్ పొలుసులకు ఎందుకంత డిమాండ్ ?
అలుగు పొలుసులతో రకరకాల ప్రయోజనాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుండటంతో వాటి పొలుసులకు బ్లాక్ మార్కెట్‌లో భారీగా డిమాండ్ ఉంది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో అలుగు పొలుసులకు ఒక్కో కేజీకి లక్షల్లో ధర పలుకుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చైనాలో సంప్రదాయ ఔషధాల తయారీలో అలుగు పొలుసులను ఉపయోగిస్తారని ప్రచారం కూడా జరుగుతోంది. ఇంకొన్ని రకాల ఔషధాల తయారీతో పాటు, వీటితో తయారు చేసిన ఉంగరాలను ధరించటం ద్వారా దుష్ట శక్తులను పారదోలవచ్చనే మూఢ నమ్మకాలు ఉండటంతో బ్లాక్ మార్కెట్లో అలుగు పొలుసులకు భారీ డిమాండ్ ఏర్పడింది. Also read: నొప్పి లేకుండా చనిపోవడం ఎలా..? గూగుల్‌లో వెతికిన Sushant

స్మగ్లింగ్ ముఠా నుంచి అటవీ శాఖ అధికారులు సుమారు నాలుగు కేజీల అలుగు పొలుసులను స్వాధీనం చేసుకున్నారు. వీటి సేకరణ కోసం మూడు నుంచి ఐదు జంతువులను కొత్తగూడెం సమీపంలోని దమ్మపేట అటవీ ప్రాంతంలో వేటాడి ఉండి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. భారత్‌లో అలుగు పొలుసులను స్మగ్లింగ్ చేస్తోన్న స్మగ్లింగ్ ముఠాలు రోడ్డు మార్గం ద్వారా బీహార్, నేపాల్, మణిపూర్, బర్మా మార్గాల్లో వీటిని చైనాకు స్మగ్లింగ్ చేసే అవకాశాలున్నట్టు అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. Also read: Short Skirts Banned: ఆ దేశంలో మహిళలు స్కర్టులు వేసుకోవడం ఇక కుదరదు

Trending News