Indiramma Houses: అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు భారీ శభవార్త ప్రకటించింది. తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లను త్వరలోనే ఇస్తామని ప్రకటన చేసింది. అర్హులైన వారిని గుర్తించి వారికి ప్రాధాన్య క్రమంలో ఇళ్లు నిర్మించి ఇస్తామని తాజాగా వెల్లడించింది. ఈ మేరకు అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష చేసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఇళ్లు ఎవరికీ ఇవ్వాలనే విషయమై చర్చ జరిగింది.
ఇది చదవండి: Deeksha Diwas: కేసీఆర్ హిమాలయమైతే.. రేవంత్ రెడ్డి ఆయన కాలిగోటికి సరిపోడు
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్ష చేశారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విధివిధానాలు, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై ఉన్నతస్థాయి సమావేశంలో చర్చించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులు ఇలా ప్రాధాన్య క్రమాన్ని ఎంచుకోవాలని సూచించారు.
ఇది చదవండి: Lagacharla Farmers: లగచర్ల రైతుల విజయం.. రేవంత్ రెడ్డి మరో యూటర్న్!
తొలి దశలో సొంత స్థలాలు ఉన్న వారికే ప్రాధాన్యం ఇస్తుండడంతో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చెప్పారు. ఈ విషయంలో పంచాయతీ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యులను చేయాలని ఆదేశించారు. దీనికి అవసరమైన సాంకేతికతను వినియోగించుకోవాలని చెప్పారు. ఇందిరమ్మ యాప్‌లో ఎలాంటి లోపాలు, లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రత్యేక కోటా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. లబ్దిదారులు ఎవరైనా ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా గదులు నిర్మించుకోవాలని ఆసక్తి చూపితే అందుకు అవకాశం కల్పించాలని ఆదేశించారు.
సంక్రాంతి తర్వాత పంపిణీ
ఇందిరమ్మ ఇళ్ల పథకం సమర్థవంతంగా కొనసాగించడానికి గృహ నిర్మాణ శాఖలో అవసరమైన అధికారులు, సిబ్బందిని నియమించుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లపై ఏడాది పాలన ఉత్సవాల్లో ప్రకటన చేసేలా ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతానికి కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పేరు మార్చి ఇందిరమ్మ ఇళ్ల పేరిట మార్చి ఇవ్వాలని కూడా యోచిస్తున్నట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.