Revanth Reddy To Etela Rajender: అమ్మవారిమీద ప్రమాణం చేసి చెబుతున్నా.. ఈటలకు రేవంత్ రెడ్డి సవాల్

Revanth Reddy To Etela Rajender: “రాజీ నా రక్తంలో లేదు.. భయం నా ఒంట్లో లేదు.. ఆఖరి రక్తపు బొట్టు వరకు నేను సీఎం కేసీఆర్‌తో పోరాటం చేస్తా.. అమ్మవారిపై ప్రమాణం చేసి చెబుతున్నా... మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్, టీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకుని ఉంటే... నా కుటుంబం సర్వ నాశనమైపోతుంది” అని చెబుతూ తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. 

Written by - Pavan | Last Updated : Apr 23, 2023, 05:15 AM IST
Revanth Reddy To Etela Rajender: అమ్మవారిమీద ప్రమాణం చేసి చెబుతున్నా.. ఈటలకు రేవంత్ రెడ్డి సవాల్

Revanth Reddy To Etela Rajender: “రాజీ నా రక్తంలో లేదు.. భయం నా ఒంట్లో లేదు.. ఆఖరి రక్తపు బొట్టు వరకు నేను సీఎం కేసీఆర్‌తో పోరాటం చేస్తా.. అమ్మవారిపై ప్రమాణం చేసి చెబుతున్నా... మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్, టీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకుని ఉంటే... నా కుటుంబం సర్వ నాశనమైపోతుంది” అని చెబుతూ తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. నిన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ రూ. 25 కోట్లు ఇచ్చినట్లు ఆరోపణలు చేశారు. దానికి ప్రతిగా బీజేపీ విశ్వసించే చార్మినార్‌‌‌‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో శనివారం సాయంత్రం 6 గంటలకు వచ్చి ప్రమాణం చేస్తా. లేకపోతే ఏ ఆలయంలో నైనా తడి బట్టలతో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా.  నాపై చేసిన ఆరోపణలను ఈటల నిరూపించడానికి సిద్ధమా? అని రేవంత్‌ రెడ్డి‌‌‌ సవాల్‌‌‌‌ విసిరారు. 

తన సవాలుకు తాను కట్టుబడి ఉంటానని చెబుతూ శనివారం సాయంత్రం రేవంత్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రమాణం చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఈటలను దుయ్యబడుతూ రేవంత్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. భాగ్యలక్ష్మి ఆలయంలో ఆత్మసాక్షిగా ప్రమాణం చేశానని తెలిపారు. తాను హిందువునని, అమ్మవారిని నమ్ముతానని అన్నారు. అందుకే ఈటల రాజేందర్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని నిరూపించుకోవడానికి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చానని చెప్పారు. తాను కేసీఆర్,టీఆర్ఎస్ నేతల దగ్గర ఒక్కరూపాయి కూడా తీసుకోలేదన్నారు.
“నన్ను అమ్ముడుపోయారని అంటావా? కేసీర్ సర్వం ధరపోసినా నన్ను కొనలేరు.. ఇది చిల్లర రాజకీయం కాదు.. పోరాటం. నా నిజాయితీని శంకిస్తే మంచిది కాదు..రేవంత్ రెడ్డిని కొనేవాడు ఇంకా పుట్టలేదు..నేను ఎవరికీ భయపడను.. నిటారుగా నిలబడి కొట్లాడుతా.. నా జీవితంలో అన్నీ ఉన్నాయి.. కేసీఆర్‌ సర్వం ధారపోసినా నన్ను కొనలేరు. బిడ్డ పెళ్లికి ఖైదీలా వచ్చిపోతే నా ఆవేదన తెలిసేది. రేవంత్‌రెడ్డిని కొనేవాడు ఇంకా పుట్టలేదు. కేసీఆర్‌ను గద్దెదించడమే నా ఏకైక లక్ష్యం. చివరి రక్తపు బొట్టు వరకు, ఒంట్లో భయం లేకుండా  కేసీఆర్ తో పోరాడుతా” అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

మునుగోడు ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు రేవంత్ రెడ్డి. మునుగోడులో బీఆర్‌ఎస్, బీజేపీ వందల కోట్లు ఖర్చు చేశాయని ఆరోపించారు. పాల్వాయి గోవర్థన్ రెడ్డి సేవలను గుర్తించి మునుగోడు ఎన్నికల్లో స్రవంతికి  పార్టీ టికెట్ కేటాయించింది. ఎన్నికల సమయంలో 300 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. ఒక్క రూపాయి, చుక్క మందు పంపిణీ చేయకుండా ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని యాదగిరిగుట్టలో ప్రమాణం చేయాలని స్రవంతి సవాల్ విసిరింది. మునుగోడులో నిజాయితీగా పనిచేసి స్రవంతిని అభ్యర్థిగా బరిలో నిలిపి  ఒక్క నోటు ఇవ్వకుండా ఓటు అడిగామని తెలిపారు. 25 వేల మంది ఓటర్లు స్రవంతి పక్కన నిలబడ్డారు అని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.

మునుగోడులో సీఎం కేసీఆర్ తో కాంగ్రెస్ ఎలాంటి లాలూచీ పడలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈటెల రాజేందర్ వ్యవహార శైలి నేను గమనిస్తున్న. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి 25 కోట్లు సాయం చేశారని ఈటెల ఆరోపించారు. ఇది ఆరోపణ కాదు.. ఆధారాలు లేవని ఈటెల అన్నారు. ఆధారాలు లేనపుడు అందరూ దేవుడిని నమ్ముతారు అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ప్రకటించారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపణలు అవాస్తవమని రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు.

‘కేసీఆర్, కేటీఆర్ దోపీడీని బయటపెట్టినందుకు నన్ను జైల్లో పెట్టారు. జైల్లో నిద్ర లేని రాత్రులు గడిపాను. కేసీఆర్‌ను ఎదుర్కొని.. ధైర్యంగా నిలబడ్డా. నోటీసులు ఇవ్వగానే ఎవరికీ నేను లొంగిపోలేదు. నాపై, పార్టీపై ఆరోపణలు చేస్తారా? ఈటల రాజేందర్‌.. ఆలోచించి మాట్లాడాలి. రాజకీయం కోసం మాలాంటి వారిపై ఆరోపణలు చేస్తావా? నిన్ను అసెంబ్లీలో కేసీఆర్ అభినందించి ఉండవచ్చు.. నా పోరాటానికి నీవు సజీవ సాక్ష్యం కాదా రాజేంద్రా. రాజేంద్రా.. నా కళ్ళలోకి చూసి మాట్లాడు... ఆలోచించి మాట్లాడు.. ఈటలపై కేసీఆర్ కక్ష కట్టినపుడు సానుభూతి చూపించాం. ఇది రాజకీయం కాదు.. నా మనోవేదన. అసత్య ఆరోపణలు మంచివి కాదు. కేసీఆర్‌ను ప్రశ్నించే గొంతులకు ఇదేనా నువ్విచ్చే గౌరవం ?’’ అని ప్రశ్నిస్తూ రేవంత్‌ రెడ్డి ఉద్వేగానికి లోనయ్యారు. నాపై ఇష్టారీతిన మాట్లాడి, తెలంగాణ సమాజం ముందు తలదించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు. మున్ముందు ఎవరిని ఎవరు గద్దె దించుతారో తెలుస్తుందన్నారు. రాజేంద్రా.. అందరితో మాట్లాడినట్లు నాతో యథాలాపంగా మాట్లాడవద్దన్నారు. నేను ఎవ్వడికి భయపడను, ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతా అని రేవంత్ ఉద్వేగంగా మాట్లాడారు. 

ఇది కూడా చదవండి : Teenmar Mallanna Exclusive Interview: తీన్మార్ మల్లన్న పార్టీ వెనుక ఎవరున్నారు ? తెలంగాణలో అసలేం జరుగుతోంది ?

తెలంగాణ సమాజం కోసం కొట్లాడే వ్యక్తిగా నాపై బురదజల్లడం మంచిది కాదని రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్ కి హిత‌వు ప‌లికారు. ఇదివరకే కేసీఆర్‌తో రాజకీయపరమైన యుద్ధాన్ని కొనసాగించేటప్పుడు ఈటల రాజేందర్ ఎక్కడ ఉన్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇదే ఈటల రాజేందర్ అప్పుడు కేసీఆర్ పంచన ఉండేవాడని గుర్తు చేశారు. నువు చేరిన పార్టీలో నీ గుర్తింపు కోసం, కుర్చీ కోసం కక్కుర్తిపడి కేసీఆర్ పైన పోరాడుతున్న నా మీద అబద్దపు ప్రచారం చేస్తావా అని నిలదీశారు. తన జీవితం ఏమీ వడ్డించిన విస్తరీ కాదని, కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటడం కోసం తొమ్మిదేళ్లుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని చెప్పారు. కేసీఆర్ దండుపాళ్యం ముఠాలు తన స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూసినా కొట్లాడుతూనే ఉన్నానని చెప్పారు. ప్రశ్నించే గొంతుల మీద ఈటెల రాజేందర్ దాడి చేస్తున్నారని, ఆయన వైఖరి తెలంగాణ సమాజానికి నష్టమా కాదా ఆలోచించుకోవాలన్నారు రేవంత్ రెడ్డి.

ఇది కూడా చదవండి : Cobra Snake in Venkateswara Swamy Temple: వెంకటేశ్వర స్వామి విగ్రహంపై పడగవిప్పిన నాగుపాము.. ఆ గుడికి క్యూ కట్టిన భక్తులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x