Rythu Bandhu: భూ యజమానులకు రేవంత్‌ సర్కార్‌ షాక్‌.. రైతుబంధు రానట్టే!

Rythu Bharosa: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం భూ యజమానులకు భారీ షాకిచ్చింది. వ్యవసాయం చేయని భూ యజమానులకు పెట్టుబడి సహాయం విషయంలో ఆంక్షలు విధించింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 10, 2024, 05:07 PM IST
Rythu Bandhu: భూ యజమానులకు రేవంత్‌ సర్కార్‌ షాక్‌.. రైతుబంధు రానట్టే!

Revanth Reddy Key Comments: పెట్టుబడి సహాయంగా ఇస్తున్న రైతుబంధుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయం చేయని భూ యజమానులకు పెట్టుబడి సహాయం ఇవ్వమని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే పెట్టుబడి సహాయం ఇస్తామని తెలిపారు. రియల్‌ ఎస్టేట్‌ భూములు, అనర్హులకు రైతు భరోసా ఇవ్వమని తేల్చి చెప్పారు. సాగు చేసే రైతులకు అందించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రైతుల రుణాలు మాఫీ చేస్తామని, బ్యాంకర్లతో చర్చలు చేస్తున్నట్లు తెలిపారు.

Also Read: Transgender: అవమానాలనే మెట్లుగా చేసుకుని ఎదిగిన ట్రాన్స్‌జెండర్‌.. ఈ కథ స్ఫూర్తిదాయకం

టీఎస్‌ ఆర్టీసీ కొత్తగా తీసుకొచ్చిన 100 ఆర్టీసీ బస్సులను హైదరాబాద్‌లో ప్రారంభించిన సీఎం ఈ సందర్భంగా మాట్లాడారు. 'ప్రభుత్వ హామీని తొలిసారి అమలుచేసింది ఆర్టీసీ కార్మికులే, తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారు. మా ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాం. గత ప్రభుత్వం రూ.27.97 లక్షల కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెడితే మేం వాస్తవ లెక్కలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టాం. గతేడాది కంటే రూ.15 వేల కోట్లు తక్కువతో బడ్జెట్‌ను రూపొందించాం' అని తెలిపారు.

Also Read: Bir Billing Dog Loyal: కన్నీటి గాథ.. యజమాని బాడీ వద్ద 48 గంటలు కాపలా కాసిన పెంపుడు కుక్క

అంతకుముందు అసెంబ్లీ లాబీల్లో పలు విషయాలపై రేవంత్‌ స్పందించారు. 'అమరుల స్థూపం, అంబేడ్కర్‌ విగ్రహం, సచివాలయం నిర్మాణంపై విచారణకు ఆదేశిస్తాం. నిర్మాణాలు, అంచనాలు, చెల్లింపు, ఖర్చులపై విచారణ జరపిస్తాం. ఇసుక విధానంపై త్వరలోనే ప్రకటన జారీ చేస్తాం. ఆరోగ్యశ్రీ పథకం రేషన్‌ కార్డుతో సంబంధం లేకుండా ప్రణాళిక చేస్తున్నాం' అని తెలిపారు. ఇక బడ్జెట్‌పై స్పందిస్తూ.. 'గతంలో బడ్జెట్లు అబద్ధాలతో నడిపించారు. మేము అబద్ధాలతో బడ్జెట్‌ ప్రవేశపెట్టలేదు. మొదటి రోజే నిజం చెప్పాలనుకున్నాం. నీటిపారుదల శాఖలో గతంలో రూ.16 వేల కోట్లు అప్పులు కట్టారు. నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేస్తాం. మేడిగడ్డకు ప్రతిపక్ష నాయకులను కూడా పిలుస్తాం. మేడిగడ్డపై విజిలెన్స్‌ విచారణ జరుగుతోంది. న్యాయ విచారణలో దోషులు తేలుతారు' అని చెప్పారు.

బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారని జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై రేవంత్‌ స్పందిస్తూ.. 'ఇతర పార్టీ ఎమ్మెల్యేలు మా పా్టీలోకి వచ్చే అంశం నా దృష్టిలో లేదు. అది పార్టీ చూసుకుంటుంది. ఎమ్మెల్యేల చేరికపై జగ్గారెడ్డినే అడగండి' అని తెలిపారు. తన తిట్ల భాషపై ప్రశ్నించగా.. 'నా భాషపై హరీశ్ రావు ఎందుకు విమర్శలు చేస్తున్నారు. నేను తెలంగాణ భాష మాత్రమే మాట్లాడుతున్నా' అని తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News