Revanth Reddy's Warning to CM KCR: సమస్య పరిష్కరిస్తారా లేదా ? సీఎం కేసీఆర్‌కి రేవంత్ రెడ్డి వార్నింగ్

Revanth Reddy's Warning to CM KCR Through Open Letter: హైదరాబాద్: కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల వేతనాల చెల్లించాలి అని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ బహిరంగ లేఖ రాశారు. 

Written by - Pavan | Last Updated : Sep 7, 2023, 06:06 AM IST
Revanth Reddy's Warning to CM KCR: సమస్య పరిష్కరిస్తారా లేదా ? సీఎం కేసీఆర్‌కి రేవంత్ రెడ్డి వార్నింగ్

Revanth Reddy's Warning to CM KCR Through Open Letter: హైదరాబాద్: కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల వేతనాల చెల్లించాలి అని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ  కాంట్రాక్ట్ ఉద్యోగులు, జూనియర్ లెక్చరర్లు కీలక పాత్ర పోషించారని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి.... తెలంగాణ రాకముందు నుండి 2014 ఎన్నికల వరకు పలు వేదికలపై తెలంగాణలో కాంట్రాక్టు, ఔట్‌‌‌‌సోర్సింగ్ ఉద్యోగుల గురించి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను, ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. తెలంగాణ వచ్చాకా సొంత రాష్ట్రంలో ఇక కాంట్రాక్టు, ఔట్‌‌‌‌సోర్సింగ్ ఉద్యోగాలు ఉండవు.. అంతా సర్కార్  ఉద్యోగులే ఉంటారు.. సమైక్య పాలకులు కాంట్రాక్టు, ఔట్‌‌‌‌సోర్సింగ్ ఉద్యోగులను చాలా బాధలు పెట్టిన్రు.. ప్రత్యేక రాష్ట్రం రాగానే ఒక్క సంతకంతో అందరినీ రెగ్యులరైజ్ చేస్తా అని తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు చాలా సార్లు హామీ ఇచ్చారని.. ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 

2014 టీఆర్ఎస్ మేనిఫెస్టోలో కూడా.. 
తెలంగాణలో కాంట్రాక్టు, ఔట్‌‌‌‌సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ అంశాన్ని 2014 టీఆర్ఎస్ మేనిఫెస్టోలో కూడా చేర్చారు అని.. ఆ ప్రకారమే వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ ని డిమాండ్ చేశారు. అందరూ కోరుకున్నట్టుగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చింది కానీ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల వెతలు తీరలేదన్నారు. వారి ఉద్యోగాల క్రమబద్ధీకరణ జరగకపోగా పైగా జీతాలు ఇవ్వండి మహాప్రభో అని ప్రభుత్వాన్ని అర్ధించాల్సిన దుస్థితి దాపురించింది అని మండిపడ్డారు. మే నెలలో రెగ్యులర్ అయిన కాంట్రాక్టు లెక్చరర్లకూ ఏప్రిల్ నెల జీతం ఇంకా రాలేదు. డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్లకూ కొన్ని జిల్లాల్లో జీతాలు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. 

జీతాలు రాక ఆర్థికంగా వాళ్లు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు..
విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నప్పటికీ.. సకాలంలో నెలలు తరబడి జీతాలు రాకపోవడంతో వందలాది మంది ఉద్యోగులు ఆర్థికంగా ఎన్నో అవస్థలు పడుతున్నారు అని రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. నెలల తరబడి జీతాలు రాక కుటుంబాలను పోషించుకోవడం వారికి కష్టంగా మారిందని... ఈఎంఐలు సకాలంలో కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు అని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో వారంతా అప్పులపాలవుతున్నారు. వాటిని సకాలంలో చెల్లించలేక మానసిక క్షోభను అనుభవిస్తున్నారు కాంట్రాక్ట్ జూనియక్ లెక్చరర్ల ఇబ్బందులపై రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు.

మీ పాలనలోనే ఈ దుస్థితి..
గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు అందేవి. కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏ రోజు జీతం పడుతుందో కూడా తెలియని దుస్థితి నెలకొందన్నారు. ఇప్పటికీ ఇంకా ఐదారు నెలలుగా  కాంట్రాక్ట్ లెక్చరర్స్ జీతాలు పెండింగ్ లో ఉండటం దురదృష్టకర పరిణామంగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఇదేనా అంటూ రేవంత్ రెడ్డి తన ఓపెన్ లెటర్ ద్వారా సీఎం కేసీఆర్ ని నిలదీశారు.

సమస్య పరిష్కరిస్తారా లేదా ? సీఎం కేసీఆర్‌కి రేవంత్ రెడ్డి హెచ్చరిక ..
" తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పుకోవడమే తప్ప కాంట్రాక్ట్ లెక్చరర్స్ కు వేతనాలు చెల్లించలేని దుస్థితి మీ ప్రభుత్వంలో దాపురించింది అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది’ అని అంటారు విద్యావేత్త కొఠారి. మరి దేశ భవిష్యత్తును నిర్ణయించే తరగతి గదుల్లో బోధించే లెక్చరర్లకు జీతాలు ఇవ్వకుండా వేధించడం ఏ మాత్రం క్షమార్హం కాదు అని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ లెక్చరర్లకు సకాలంలో జీతాలు వచ్చేలా చూడాల్సిన బాధ్యత మీపైన ఉందన్నారు. లేనిపక్షంలో వారి పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలవడమే కాక... వారి తరపున ప్రత్యక్ష కార్యాచరణకు సైతం సిద్ధమవుతాం " అని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Trending News