Agriculture Loans For Farmers: రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్త సంక్షేమ పథకాలు తీసుకువస్తోంది. ఇప్పటికే అమల చేస్తున్న పథకాలకు తోడు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం కిసాన్ పంటల బీమా వంటి స్కీమ్స్‌ను మోదీ సర్కారు తీసుకువచ్చింది. తాజాగా అన్నదాతలకు మరో అదిరిపోయే గుడ్‌న్యూస్ వచ్చింది. ఇక నుంచి తాకట్టు లేకుండానే అధిక మొత్తంలో లోన్లు తీసుకునే విషయంపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వివరాలు ఇలా..
Farmers Loan Waiver: కరోనా సమయంలోనూ రైతుల కోసం తమ సీఎం కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలను నిరాటంకంగా కొనసాగించారని మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు అదే రీతిలో రుణ మాఫీ చేసి రైతు కుటుంబాల్లో ఆనందం నింపారని మంత్రి హరీశ్ రావు అభిప్రాయపడ్డారు.
Farmers Loans Waiver: రైతుల రుణ మాఫీకి సంబంధించి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుకి సోమవారం ఆదేశాలు జారీచేశారు. రైతుల తరఫున బ్యాంకులకు డబ్బు మొత్తాన్ని తక్షణం జమ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో సోమవారం 9 లక్షల 2 వేల 843 మంది రైతులకు సంబంధించి 5809.78 కోట్ల రూపాయలను విడుదల చేశారు.
Farmers Crop Loans Waiver News Updates : హైదరాబాద్ : తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఓట్లు దండుకోవడమే లక్ష్యంగా మరోసారి రైతు రుణమాఫీ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి నాటకం ఆడుతున్నారని ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణలపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు.
Kisan Credit Cards Benefits: కిసాన్ క్రెడిట్ కార్డు ఒకసారి జారీ చేస్తే.. 3 ఏళ్ల వ్యాలిడిటీ ఉంటుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించి పొందిన క్రెడిట్‌ని.. పంట చేతికొచ్చాకా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఉన్న వారికి రూ. 1.60 లక్షలు వరకు ఎలాంటి కొలేటరల్ సెక్యురిటీ లేకుండా రుణం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.
Rythu runamafi in Telangana: హైదరాబాద్: రైతు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ (Good news) చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,006 కోట్లు జమ చేయనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ సర్కార్ రైతులకు తీపి కబురు వినిపించింది. రైతులకు రైతుబంధు పథకం (Rythu bandhu scheme) కింద పంట పెట్టుబడి కోసం అందిస్తున్న ఆర్థిక సహాయానికి సంబంధించి రూ. 7 వేల కోట్ల నిధులను సర్కార్ (Telangana govt) విడుదల చేసింది. అంతేకాకుండా కాకుండా రూ. 25 వేల లోపు ఉండే రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేసేలా తెలంగాణ సర్కార్ రూ.1200 కోట్లు విడుదల చేసింది.
కర్నాటకలో రైతులకు శుభవార్త. రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేశారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కుమారస్వామి గురవారం ఈ ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ , జేడీయూ పార్టీలు రైతు రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చాయి. ఈ క్రమంలో సీఎం కుమారస్వామి ఈ రోజు రుణాలను మాఫీ చేసి రైతులకు ఊరట కల్గించారు. అయితే రుణమాఫీకి ఎలాంటి పద్దతి అవలంభిస్తారనే విషయం కుమారస్వామి వివరించలేదు.
కర్ణాటకకు 24వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తొలిసారి మీడియాతో మాట్లాడిన కుమారస్వామి.. కర్ణాటక రైతులకు గుడ్ న్యూస్ వినిపించారు. ఎన్నికల ప్రచారంలో ప్రకటించినట్టుగానే రైతుల రుణాలను మాఫీ చేయనున్నట్లు కుమారస్వామి ప్రకటించారు. ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం కర్ణాటకలో 104 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీ అవతరించిన బీజేపీ తరుపున ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన బీఎస్ యడ్యూరప్ప సైతం మొదటిగా ఇదే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.