saroornagar honour killing: సరూర్‌నగర్ పరువుహత్య, రాజకీయ దుమారం..!

saroornagar honour killing: సరూర్‌నగర్ పరువుహత్య రాజకీయ రంగు పులుముకుంది. ఇది ముమ్మాటికీ ఎంఐఎం గూండాలు చేసిన మతహత్యే అని బీజేపీ ఆరోపిస్తోంది. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ గతి తప్పడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని మండిపడుతోంది. ఒక దళితున్ని నడిరోడ్డుపై చంపేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న దళితనేతలు ఎందుకు స్పందించడంలేదని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 5, 2022, 04:13 PM IST
  • సరూర్‌నగర్ పరువుహత్యపై రాజకీయ దుమారం
    హత్యపై తీవ్రంగా స్పందించిన బీజేపీ
    కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్
saroornagar honour killing: సరూర్‌నగర్ పరువుహత్య, రాజకీయ దుమారం..!

saroornagar honour killing: హైదరాబాద్ సరూర్‌నగర్ లో నడిరోడ్డుపై జరిగిన పరువుహత్య సంచలనం సృష్టించింది. ఇష్టంలేకుండా పెళ్లిచేసుకున్నారన్న కక్షతో అమ్మాయి సోదరుడు.... నాగరాజు అనే యువకుడిని  కిరాతకంగా చంపేశాడు. అమ్మాయి ముందే అత్యంతదారుణంగా హత్యచేశాడు. చుట్టూ వందలమంది ఉన్నా ఈ దారుణాన్ని ఎవరూ ఆపలేకపోయారు. భర్తను కాపాడుకోవడానికి ఆ అమ్మాయి ఎంత ప్రాధేయపడినా ఆ ఉన్మాది కనికరించలేదు. నగరం నడిబొడ్డున జరిగిన ఈ దారుణహత్యతో అందరూ ఉలిక్కిపడ్డారు. హత్యచేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్‌చేశారు. హత్యకు గురైన నాగరాజు దళితుడు కాగా.. అమ్మాయి ముస్లిం.

సరూర్‌నగర్ లో జరిగిన నాగరాజు పరువు హత్య ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓ ముస్లిం అమ్మాయిని పెళ్లిచేసుకున్నందుకే దళితయువకుడిని చంపేశారని .. ఇది ముమ్మాటికీ మతహత్యేనని బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్ ఆరోపించారు. ఇలాంటి కిరాతక హత్యపై సెక్యులర్ మేధావులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. భవిష్యత్తులో ముస్లిం అమ్మాయిలను పెళ్లిచేసుకోకుండా హిందువులను భయపెట్టేందుకే ఈ హత్య చేశారన్నారు. గతంలో మిర్యాలగూడలో జరిగిన పరువు హత్యపై ఆందోళనలు చేసిన అభ్యుదయ వాదులు ఇప్పుడెందుకు స్పందించడం లేదన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న మతోన్మాద శక్తులపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. 

సరూర్‌నగర్ హత్యలో ఎంఐఎం హస్తం ఉందని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. అసదుద్దీన్ పార్లమెంటరీ పరిధిలో జరిగిన ఈ ఘటనపై ఆయన ఎందుకు స్పందించడం లేదన్నారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ గతితప్పిందని మండిపడ్డారు రాజాసింగ్. ముస్లిం అమ్మాయిని హిందూ పెళ్లిచేసుకోవడం తప్పైతే.. లవ్ జీహాద్ కూడా ముమ్మాటికీ తప్పేనన్నారు. 

మరోవైపు టీఆర్ఎస్ అండతోనే ఎంఐఎం గూండాలు నాగరాజును హత్యచేశారని ఆరోపించారు బీజేపీ ఎంపీ సోయం బాపూరావు. మైనార్టీ అమ్మాయిని పెళ్లిచేసుకుంటే దళిత అబ్బాయిని నడిరోడ్డుపై చంపేస్తారా అని ప్రశ్నించారు. హిందూ బిడ్డలపై జరుగుతున్న దాడులపై హోంమంత్రి ఎందుకు స్పందించడంలేదన్నారు. నాగరాజును చంపినవారిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలన్నారు సోయం బాపూరావు. అటు సరూర్‌నగర్ పరువు హత్యపై టీఆర్ఎస్ దళితనేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొప్పుబాషా. పక్కరాష్ట్రాల్లో ఏదైనా ఘటన జరిగితే వెంటనే స్పందించే బాల్కసుమన్ ఇప్పుడు ఎక్కడకు పోయారన్నారు. నాగరాజు కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందన్నారు. 

also read: Twin Murders: జంట హత్యల కేసులో షాకింగ్ విషయాలు... చంపింది ఆమె భర్తే.. 30కి.మీ వెంబడించి...

also read: Rajiv Swagruha Flats for Sale : స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి రంగం సిద్ధం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
 

Trending News