Pidamarthi Ravi Joins in Congress: తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీకి వరుసగా నాయకులు షాక్‌లు ఇస్తున్నారు. రేపు ఖమ్మంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుండగా.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హస్తం గూటికి చేరనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య కూడా బీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన కూడా రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తాజాగా మరో నేత బీఆర్‌ఎస్‌కు ఝలక్ ఇచ్చారు. మాజీ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఓ లేఖను విడుదల చేశారు.
"దళితులను సీఎం చేస్తా అంటే టీఆర్‌ఎస్ పార్టీలో చేరినా.. సీఎం చేయలేదు. డిప్యూటీ సీఎం చేసి ఆయనను బర్తరఫ్ చేశాడు. ఇప్పటికి బర్తరఫ్‌కు కారణం చెప్పలేదు. చివరి దళితుడికి మూడెకరా ఎకరాల భూమి ఇస్తానని చెప్పి.. కొన్ని ఎకరాలు మాత్రమే పంచారు. ఇప్పుడు దళితబంధు ద్వారా దళితులకు రావాల్సిన డబ్బులను ఎమ్మెల్యేల పరం చేస్తున్నారు. మాదిగలకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఎస్సీ వర్గీకరణ చేయలేదు. ఎస్సీ రిజర్వేషన్ 20 శాతానికి పెంచలేదు. తెలంగాణ ఉద్యమంలో జెండా పట్టి.. జై కొట్టిన వారికి జైలుకి వెళ్లిన వారికి పింఛన్ ఇవ్వలేదు.
2018 ఎన్నికల్లో ఓడిపోతే కనీసం పలకరింపు లేదు. ఆయన బిడ్డకు ఎమ్మెల్సీ, ఆయన బంధువుకు చైర్మన్ పదవి ఇచ్చాడు. తనకు ఓట్లు వేయలేదని ఖమ్మం జిల్లా అభివృద్ధిపై సవితి ప్రేమ చూపిస్తున్నాడు. దళిత నాయకులు సాయన్న, గూడ అంజన్న, సాయి చందులకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయకుండా కుల వివక్షత చూపించాడు. సోనియ గాంధీకి ధన్యవాదాలు తెలిపేందుకే కాంగ్రెస్‌లో చేరుతున్నా.." అని పిడమర్తి రవి లేఖలో పేర్కొన్నారు.
నాలుగు దశాబ్ధాల పోరాటానికి సోనియా గాంధీ ముగింపు పలికారని అన్నారు. తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయిందన్నారు. ఆమెను కేసీఆర్ మోసం చేశాడని.. టీఆర్‌ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని అబద్దాలు ఆడాడని మండిపడ్డారు. తెలంగాణను ఇచ్చిన తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని చెప్పారు. ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేర్చుతానని అన్నారు.
తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్న వారికి పింఛన్, డబుల్ బెడ్‌రూంల అవకాశం వచ్చేటట్లు కృషి చేస్తానని పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణనే లేదని.. ఆమె పార్టీలో పని చేయటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. నాలుగేళ్లు అపాయింట్‌మెంట్ ఇవ్వలేని వారు.. నాలుగు విషయాలు తనతో మాట్లాడలేని వారు.. తనకు రాజకీయ అవకాశాలు ఇస్తారని నమ్మకం లేదన్నారు. నమ్మకం లేని దగ్గర ఉండకూడదని పార్టీని వీడుతున్నానని తెలిపారు.
Also Read: Pawan Kalyan Tholi Prema: పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ రీరిలీజ్.. థియేటర్‌లో ఫ్యాన్స్ రచ్చ రచ్చ
Also Read: TS Politics: బీఆర్ఎస్‌కు భారీ షాక్.. జడ్పీ ఛైర్మన్, 56 మంది సర్పంచ్‌లు, 26 మంది ఎంపీటీసీలు గుడ్‌బై
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook