Students Protest: విద్యార్థినులను బట్టలూడదీసి కొడతానన్న టీచర్.. రోడ్డెక్కిన స్టూడెంట్స్

Students Protest Against Teacher: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని మేనూర్ ఆదర్శ పాఠశాలలో తెలుగు టీచర్ గా పని చేస్తోన్న మహేశ్వరి గత కొంతకాలంగా విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తోందని ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుతుండడంతో ఆమె వైఖరి నచ్చని విద్యార్థులు ఆమె ఫోటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో సోది క్లాసు అంటూ పోస్ట్ చేశారు.

Written by - Pavan | Last Updated : Nov 30, 2022, 09:51 AM IST
  • క్లాస్ రూమ్‌లో జీఎఫ్ అంటే బీఎఫ్ ఏంటి అని టీచర్ అడుగుతున్నారంటున్న స్టూడెంట్స్
  • టీచర్ వైఖరి నచ్చకపోవడంతో సోది క్లాస్ అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టిన విద్యార్థులు
  • ఇన్‌స్టాలో స్టోరీ చూసి స్టూడెంట్స్‌ని చితకబాదిన టీచర్
Students Protest: విద్యార్థినులను బట్టలూడదీసి కొడతానన్న టీచర్.. రోడ్డెక్కిన స్టూడెంట్స్

Students Protest Against Teacher: విద్యా బుద్దులు నేర్పించాల్సిన ఉపాద్యాయురాలు విద్యార్థులతో అసభ్యకరంగా మాట్లాడుతూ వారికి బూతు పురాణం వల్లిస్తున్న టీచర్ ఉదంతం ఇది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని మేనూర్ ఆదర్శ పాఠశాలలో మంగళవారం ఇంటర్మీడియట్ విద్యార్థినులను గదిలో వేసి పచ్చి కట్టెలు విరిగి పోయేలా కొట్టడంతో అసలు బాగోతం వెలుగు చూసింది. విచక్షణా రహితంగా ఇంటర్మీడియట్ట్ విద్యార్థినులను బాదిన తెలుగు టీచర్ మహేశ్వరిని వెంటనే సస్పెండ్ చేయాలంటూ పాఠశాల ఎదుట విద్యార్థులు నిరసనకు దిగారు.

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని మేనూర్ ఆదర్శ పాఠశాలలో తెలుగు టీచర్ గా పని చేస్తోన్న మహేశ్వరి గత కొంతకాలంగా విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తోందని ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుతుండడంతో ఆమె వైఖరి నచ్చని విద్యార్థులు ఆమె ఫోటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో సోది క్లాసు అంటూ పోస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ పోస్ట్ చూసిన భర్త ఇదేంటని ప్రశ్నించడంతో సదరు టీచర్ విద్యార్థినులను పిలిపించి ఆ పోస్ట్ చేసింది ఎవరు అంటూ ప్రశ్నించారు. 

దీంతో ఆ పోస్ట్ చేసిన విద్యార్థిని తల్లిదండ్రులు తప్పయిందంటూ మరొకసారి ఇలా జరగకుండా చూసుకుంటామంటూ క్షమాపణలు కోరారు. అయినప్పటికీ శాంతించని తెలుగు టీచర్ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన విద్యార్థినిలకు పచ్చి కట్టెలు విరిగేలా విచక్షణారహితంగా కొట్టారు. దీంతో ఆ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని సదరు ఉపాధ్యాయురాలతో వాగ్వివాదానికి దిగారు. విద్యార్థినులను అలా ఎందుకు కొట్టావని నిలదీశారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన మీరు ఇలా విద్యార్థుల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టడం ఎందుకని ప్రశ్నించారు.

బట్టలూడదీసి కొడతానంటూ అసభ్యంగా, అసహ్యంగా టీచర్ మాట్లాడుతూ తమను ఇష్టం వచ్చినట్టు కొట్టిందంటూ భాధిత విద్యార్థులు తమ బాధను చెప్పుకుని బోరుమన్నారు. విద్యార్థినుల పట్ల మహేశ్వరి టీచర్ పైచాశికంపై ఆగ్రహించిన పాఠశాల విద్యార్థులు అందరూ పాఠశాల ముందు కూర్చుని ప్రిన్సిపాల్ డౌన్ డౌన్ అంటూ తెలుగు టీచర్ మహేశ్వరిని వెంటనే బదిలీ చేయాలని, ఆమెను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు.

Also Read : Kalvakuntla Kavitha: రేవంత్ రెడ్డి అప్పుడు ఎక్కడున్నాడు ? కల్వకుంట్ల కవిత కౌంటర్

Also Read : Meadaram Jathara 2023: మేడారం మిని జాతరకు తేదీలు ఖరారు

Also Read : Kalvakuntla Kavitha: అవి కాంగ్రెస్ చేసిన హత్యలే.. కల్వకుంట్ల కవిత ఫైర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News