/telugu/photo-gallery/puri-jagannadh-explains-about-emotional-blockmail-in-puri-musings-pa-180794 Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్..  షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్.. షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? 180794

Tamilisai Soundararajan vs Telangana govt: గవర్నర్ ప్రసంగం వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై వ్యతిరేకత, అభ్యంతరాలు కొనసాగుతున్నాయి. బడ్జెట్ సమావేశాల్ని గవర్నర్ ప్రసంగం లేకుండానే నిర్వహించనుండటంపై స్వయంగా గవర్నర్ తమిళ్‌సై సౌందరరాజన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై ఆ రాష్ట్ర గవర్నర్ తమిళ్‌సై సౌందరరాజన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడంపై తీవ్ర అసంతృప్తికి గురైన ఆమె మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే..బడ్జెట్‌ను స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ఐదు నెలల సుదీర్ఘ విరామం తరువాత సమావేశాలు ప్రారంభమవుతున్నా..ప్రభుత్వం కొనసాగింపు అనడం సరైంది కాదని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం లేకపోవడమనేది సాంకేతికంగా  తప్పుకాకపోయినా.. ప్రభుత్వ వైఖరి మాత్రం మంచిది కాదన్నారు. ప్రజలు ఈ వ్యవహారం గమనించాలని ఆమె కోరారు. ప్రభుత్వ నిర్ణయంతో రాజ్యాంగ హక్కులకు భంగం వాటిల్లినట్టేనన్నారు. గవర్నర్ ప్రసంగం లేకుండా చేయడమంటే..సభ్యులు చర్చించే హక్కును కోల్పోయినట్టేనన్నారు. 

అసెంబ్లీ సమావేశాల్లో సుదీర్ఘ విరామం వచ్చిందంటే..కచ్చితంగా కొత్త సమావేశాలుగానే భావించాలని ఆమె చెప్పారు. అసలు గవర్నర్ ప్రసంగమనేది గవర్నర్ కార్యాలయం నుంచి సిద్ధం కాదని..అది ప్రభుత్వ అధికారిక ప్రకటన అని ఆమె అన్నారు. గవర్నర్ ప్రసంగమనేది ప్రభుత్వం చేసిన పనులు, అమలు చేసిన విధానాలు, తీసుకున్న నిర్ణయాలపై రిపోర్ట్ కార్డ్ అని చెప్పారు. గవర్నర్ ప్రసంగం ద్వారా సభ్యులకు అర్ధవంతమైన చర్చకు అవకాశం కల్పిస్తుందన్నారు. ఎన్నికైన సభ్యులకు ప్రభుత్వం బాధ్యత వహించేలా చేసేందుకు ప్రజాస్వామ్యంలో ఇదొక కీలకమైన ప్రక్రియగా ఆమె అభివర్ణించారు. అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో గవర్నర్ ప్రసంగంతో జరగడమనేది ఓ సాంప్రదాయమన్నారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ..రాజకీయ నిర్ణయాలతో ప్రభావితమైనా సరే..కో ఆపరేటివ్ ఫెడరల్ వ్యవస్థపై నమ్మకంతో బడ్జెట్ ప్రవేశపెట్టేందుతు తాను సిఫారసు చేస్తున్నానని తమిళ్‌సై సౌందరరాజన్ స్పష్టం చేశారు. 

ప్రజల ప్రాధాన్యత, ప్రజల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని..కాలయాపన లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు తాను సిఫారసు చేశానన్నారు. గవర్నర్ ప్రసంగం లేకపోవడం వల్ల గత సంవత్సరం ప్రభుత్వ పనితీరుపై చర్చించే అవకాశాన్ని సభ్యులు కోల్పోయారన్నారు. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలకు తన శుభాకాంక్షలు అందిస్తున్నానన్నారు. రాజ్యాంగం కొన్ని ప్రత్యేక అధికారాలు ఇచ్చినా...ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం లేదని నిర్ణయించినా..ప్రజల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని తాను సిఫారసు చేస్తున్నట్టు చెప్పారు. 

Also read: Rajanna Sircilla: కాంగ్రెస్ ఇచ్చిన ఇళ్ల పట్టాలను.. టీఆర్​ఎస్ వెనక్కి తీసుకుంటోంది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Tamilnadu governor tamilsai soundararajan unhappy with governments decision of not holding address, releases press note
News Source: 
Home Title: 

Tamilisai Soundararajan: ప్రసంగం లేకపోవడంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర అసంతృప్తి, మీడియాకు లేఖ

Tamilisai Soundararajan: ప్రసంగం లేకపోవడంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర అసంతృప్తి, మీడియాకు లేఖ విడుదల
Caption: 
Soundararajan letter to media ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

బడ్జెట్ సెషన్స్‌లో గవర్నర్ ప్రసంగం లేకుండా నిర్వహించడంపై ఆగ్రహం.

మీడియాకు లేఖ విడుదల చేసిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

గవర్నర్ ప్రసంగం లేకపోవడమంటే చర్చించే హక్కును సభ్యులు కోల్పోయినట్టే

Mobile Title: 
Tamilisai Soundararajan: ప్రసంగం లేకపోవడంపై గవర్నర్ తీవ్ర అసంతృప్తి, మీడియాకు లేఖ
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Saturday, March 5, 2022 - 22:00
Created By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
57
Is Breaking News: 
No