Suicide Or Death: సాఫ్ట్ వేర్ ఉద్యోగి అనుమానాస్పద మృతి.. భర్త వేధింపులే కారణం ?

కామారెడ్డికి ( Kamareddy ) చెందిన శరణ్య ( 25 ) వివాహిత బెంగుళూరులో ( Benguluru ) అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ( Software Engineer ) పని చేస్తున్న శరణ్య మరణ వార్త తెలియగానే కామారెడ్డిలోని ఆమె తల్లిదండ్రులు హుటాహుటిన బెంగుళూరుకు బయల్దేరారు. 

Last Updated : Aug 7, 2020, 08:23 PM IST
Suicide Or Death: సాఫ్ట్ వేర్ ఉద్యోగి అనుమానాస్పద మృతి.. భర్త వేధింపులే కారణం ?

తెలంగాణ: కామారెడ్డికి ( Kamareddy ) చెందిన శరణ్య ( 25 ) వివాహిత బెంగుళూరులో ( Benguluru ) అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ( Software Engineer ) పని చేస్తున్న శరణ్య మరణ వార్త తెలియగానే కామారెడ్డిలోని ఆమె తల్లిదండ్రులు హుటాహుటిన బెంగుళూరుకు బయల్దేరారు. భర్త రోహిత్ వల్ల శరణ్య ఆత్మహత్య ( Saranya Suicide Kamareddy ) చేసుకుని ఉండవచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు తల్లిదండ్రులు. శరణ్య , రోహిత్ వివాహం సంవత్సరం క్రితమే జరిగింది  

శరణ్య, రోహిత్ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని.. వారిద్దరూ క్లాస్ మేట్ అని తెలిసింది. వీరిద్దరూ కామారెడ్డికి చెందినవారే. పెళ్లి తరువాత రోహిత్ మద్యం సేవించి తన కూతురిని వేధించడం మొదలుపెట్టాడని శరణ్య తల్లిండ్రులు తెలిపారు. దాంతో అతని టార్చర్ భరించలేక కామారెడ్డిలోని తమ ఇంటికి తిరిగివచ్చిందని.. కానీ కోర్టు సమక్షంలో తన భార్యను బాగా చూసుకుంటా అని రోహిత్ ఒప్పుకుని.. తిరిగి ఆమెను బెంగుళూరు తీసుకెళ్లాడట. తరువాత ఇలా జరిగింది అని తెలిపారు శరణ్య తల్లిందండ్రులు.


Note: Read About Coronavirus Top Tips and Covid-19 Prevention Here: 

ముఖ్య గమనిక: కరోనావైరస్ నివారణ, కోవిడ్-19 నివారణ చిట్కాల కోసం దిగువ ఆర్టికల్స్ చదవగలరు.

Trending News