భారతదేశ మాజీ ప్రధాని ( Indian Ex Pm ) పీవీ నరశింహారావు ( Pv Narasimha rao ) కు బారత రత్న పురస్కారం కోసం తెలంగాణా అసెంబ్లీలో తీర్మానం రానుంది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పీవీకు సంబంధించిన మరి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ( Telangana Assembly Sessions ) వచ్చే నెలలో జరగనున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేకంగా మాజీ ప్రదాని పీవీ నరశింహారావుకు భారత రత్న ( Bharat Ratna Award ) ఇవ్వాలని కోరుతూ...తీర్మానం ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM Kcr ) నిర్ణయించారు. పీవీ నరశింహారావు శత జయంతి ఉత్సవాలపై ( Centenary Birth anniversary celebrations ) ప్రగతి భవన్ ( Pragathi Bhavan ) లో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీలో పీవీ నరశింహారావు తైల వర్ణ చిత్రాన్ని పెడతామని...అటు పార్లమెంట్ లో కూడా పెట్టే విధంగా కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తామన్నారు కేసీఆర్. మరోవైపు నెక్లెస్ రోడ్ కు పీవీ జ్ఞానమార్గ్ ( Pv Jnan marg ) గా పేరు పెడతామని చెప్పారు. హైదరాబాద్ లో పీవీ మెమోరియల్ ను నిర్మించనున్నట్టు ప్రకటించారు.
భారతదేశంలో అనేక ఆర్ధిక సంస్కరణలు ( Economic reforms ) అమలు చేసిన మహనీయుడని..ప్రపంచం గుర్తించిన మహా మనిషని కేసీఆర్ పీవీను కీర్తించారు. అంతటి మహోన్నత వ్యక్తి గొప్పతనాన్ని రాష్ట్ర అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. పీవీ నెలకొల్పిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ( Central University ) కు సైతం ఆయన పేరు పెట్టేలా కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో మరో తీర్మానం చేస్తామన్నారు. Also read: Telangana: భారీగా పెరిగిన కరోనా కేసులు