Breaking News: తెలంగాణ వ్యాప్తంగా జనవరి 10న బంద్ కు పిలుపునిచ్చిన బీజేపీ

Telangana Bandh on January 10: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అమలులోకి తీసుకొచ్చిన 317 జీవోను మళ్లీ సమీక్షించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో జనవరి 10న రాష్ట్రవ్యాప్త బంద్ ను బీజేపీ శ్రేణులు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు ప్రజలందరూ మద్దతివ్వాలని వారు కోరారు.    

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2022, 07:31 PM IST
    • తెలంగాణ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన బీజేపీ
    • 317 జీవోను పునఃపరిశీలించాలని డిమాండ్
    • ఈమేరకు జనవరి 10న రాష్ట్ర బంద్ కు పిలుపు
Breaking News: తెలంగాణ వ్యాప్తంగా జనవరి 10న బంద్ కు పిలుపునిచ్చిన బీజేపీ

Telangana Bandh on January 10: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌తో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20న బంద్ కు పిలుపునిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విభాగం. ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేక జీవో అక్రమ అరెస్టులు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అమలులోకి తీసుకొచ్చిన 317 జీవోను మళ్లీ సమీక్షించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అలాగే, ఇందుకు నిరసనగా ఆందోళన చేస్తున్న అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

బంద్ కు కారణం

ఇటీవలే 317 జీవోను పునః సమీక్షించాలని దీక్ష చేపట్టిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు వివిధ ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్న బీజేపీ శ్రేణులపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 

ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలపాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈనెల 10న తెలంగాణ బంద్‌కు భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. అన్ని వర్గాల ప్రజలు బంద్ పాటించి మద్దతు ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ ప్రజలను కోరింది. 

Also Read: Bandi Sanjay: బండి సంజయ్‌కి హైకోర్టు బెయిల్.. జైలు నుంచి విడుదలకు ఆదేశాలు

Also Read: BJP Dharma Yuddham: ధర్మ యుద్ధం సాగిస్తాం.. బండి సంజయ్ అరెస్ట్‌ అక్రమం.. కేసీఆర్‌‌పై విరుచుకపడ్డ జేపీ నడ్డా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News