Bandi Sanjay on CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా లక్ష ఉద్యోగాలను మాయం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ నిరుద్యోగుల పొట్ట కొడుతున్నాడని ఫైర్ అయ్యారు. బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కోర్టు కేసులు, ఇతరత్రా సాకులతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వాయిదా వేస్తే సహించేది లేదన్నారు. కేసీఆర్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా... ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికలకు వెళ్లబోమని ప్రకటించాలని బీజేపీ డిమాండ్ చేశారు.
ఆ దెబ్బతోనే ఆగమేఘాల మీద ప్రకటన :
ఉద్యోగ నోటిఫికేషన్లపై సీఎం కేసీఆర్ మోసపూరిత ప్రకటనలు విని విని.. ఇక ఉద్యోగాలు రావని మనస్తాపం చెంది వందలాది మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని బండి సంజయ్ అన్నారు. ఇన్నాళ్లకైనా కేసీఆర్ మనసు కరిగి ఉద్యోగాలపై ప్రకటన చేశాడంటే అది బీజేపీ సాధించిన విజయమేనని పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీ కోసం బీజేపీ అనేక పోరాటాలు చేసిందన్నారు.
నిరుద్యోగులతో మిలియన్ మార్చ్ నిర్వహించబోతున్నామని బీజేపీ చేసిన ప్రకటన కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టించిందన్నారు. మిలియన్ మార్చ్‌కు ఇప్పటికే దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని.. ఈ విషయాన్ని ఇంటలిజెన్స్ ద్వారా కేసీఆర్ తెలుసుకున్నారని అన్నారు. ఇక ఉద్యోగాల భర్తీ చేపట్టకపోతే యువతీ యువకులు తన భరతం పడుతారని కేసీఆర్‌కు అర్థమైందన్నారు. అలాగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీదే అధికారమని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయని.. ఈ రెండింటి దెబ్బతోనే ఆగమేఘాల మీద కేసీఆర్ ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేశారని అన్నారు.
అది సిగ్గుచేటు విషయం :
ఉద్యోగాల భర్తీ, కొత్త జోనల్ విధానం ఆలస్యం కావడానికి కేంద్రమే కారణమన్న కేసీఆర్ వ్యాఖ్యలను సంజయ్ ఖండించారు. నోటిని అదుపులో ఉంచుకుని మాట్లాడాలని హెచ్చరించారు. కొత్త జోనల్ వ్యవస్థకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు విడుదలైన 40 నెలల దాకా కేసీఆర్ స్పందించలేదన్నారు. తన చేతగానితనాన్ని కేంద్రంపై నెట్టడం సిగ్గుచేటన్నారు.
Also Read: KCR Jobs Announcement: ఏపీలోనూ కేసీఆర్‌కు క్రేజ్.. సీఎం చిత్ర పటానికి పాలాభిషేకాలు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook