CM KCR SALUTE HARISH RAO: హరీశ్ రావుకి సీఎం కేసీఆర్ సెల్యూట్.. ఎందుకో తెలుసా?

CM KCR SALUTE HARISH RAO: తెలంగాణ హెల్త్ మినిస్టర్ హరీష్ రావుకు సెల్యూట్ చేశారు సీఎం కేసీఆర్. గాంధీ హాస్పిటల్ లో జరిగిన సభలో అభినందించారు. కొవిడ్ సమయంలో చేసిన సేవలను గుర్తు చేస్తూ ప్రశంసలు జల్లు కురిపించారు సీఎం కేసీఆర్.

Written by - Srisailam | Last Updated : Oct 2, 2022, 02:49 PM IST
  • తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గాంధీ జయంతి
  • గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్
  • హెల్త్ మినిస్టర్ హరీష్ కు సీఎం సెల్యూట్
CM KCR SALUTE HARISH RAO: హరీశ్ రావుకి సీఎం కేసీఆర్ సెల్యూట్.. ఎందుకో తెలుసా?

CM KCR SALUTE HARISH RAO: భారత జాతిపిత మహాత్మగాంధీ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి నుంచి సామాన్యుడి వరకు అంతా మహాత్ముడికి నివాళి అర్పించారు. బాపూజీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఎంజీ రోడ్డులో 16 అడుగుల ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గాంధీ విగ్రహావిష్కరణ అనంతరం అక్కడ నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య శాఖ మంత్రి హరీష రావుకు సెల్యూట్ చేశారు కేసీఆర్. ఈ పరిణామం అందరిని ఆశ్చర్యపరిచింది.

కొవిడ్ కల్లోల సమయంలో గాంధీ హాస్పిటల్ వైద్యులు ఎంతో సేవ చేశారని  కేసీఆర్ కొనియాడారు. గాంధీ డాక్టర్లు మహమ్మారితో యుద్ధం చేశారని చెప్పారు. మంచి చేస్తే తప్పకుండా ప్రశంసలు వస్తాయన్న ముఖ్యమంత్రి.. కొవిడ్ సమయంలో ధైర్యంగా పనిచేసిన వైద్యులు, ఆరోగ్య సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగానే  హెల్త్ మినిస్టర్ హరీశ్‌రావుకు సెల్యూట్ చేశారు సీఎం కేసీఆర్. మహాత్మ గాంధీ సిద్ధాంతం అందరికి సార్వజనీతం అని చెప్పారు. రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి గొప్ప వ్యక్తి గాంధీని మహాత్మ అని సంభోధించారని కేసీఆర్ చెప్పారు.

గాంధీ మార్గంలోనే దశాబ్ద కాలానికి పైగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసీఆర్ చెప్పారు. బాపూజీ పుట్టిన  దేశంలో మనం పుట్టడం ఎంతో పుణ్యమన్నారు.  గాంధీ ప్రతి మాట, పలుకు ఎంతో గొప్పదన్నారు. ఈ మధ్య తాను వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నానని కొందరు తనతో చెప్పారన్నారు కేసీఆర్.  శాంతి ఉంటేనే ప్రజలంతా సుఖంగా ఉంటారన్నారు. వేల కోట్ల ఆస్తులు ఉన్నా  శాంతి లేకపోతే జీవితం ఆటవికమేనన్నారు సీఎం కేసీఆర్. దేశంలో ప్రస్తుతం గాంధీ స్పూర్తికి విఘాతం కల్గిస్తూ  సమాజాన్ని చీల్చే చిల్లర మల్లర ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మహాత్ముడినే కించపరిచే కామెంట్లు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జాతిపితను కించపరిచే మాటలు విన్నప్పుడు చాలా బాధ కలుగుతుందన్నారు తెలంగాణ సీఎం. గాంధీజి ప్రతిష్టను ఎవరూ భంగం కలిగించలేరన్నారు. మరుగుజ్జులు ఏనాడు మహాత్ములు కాలేరంటూ పరోక్షంగా బీజేపీ నేతలను టార్గెట్ చేశారు సీఎం కేసీఆర్. దేశంలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కరంగా ఉన్నాయని... ఇవి దేశ పురోగతికి ఆటంకం కల్గిస్తాయని అన్నారు.

Read Also: Munugode Bypoll: అక్టోబర్ 7న మునుగోడు బైపోల్ నోటిఫికేషన్? బీజేపీ నేతలకు ఢిల్లీ నుంచి మెసేజ్..

Read Also: KTR TWEET: ఈసీ, ఈడీ, సీబీఐ, ఎన్ఐఏ, ఐటీ కలిస్తేనే బీజేపీ... మునుగోడు బైపోల్ పై మంత్రి కేటీఆర్ ట్వీట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News