Telangana's KCR To Launch National Party Today: గులాబీ పార్టీలో నేడు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. తెలంగాణ రాష్ట్ర సమితి నేడు జాతీయపార్టీగా రూపాంతరం చెందనుంది.. ఈ క్రమంలో పేరుతోపాటు టీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగం మౌలిక నిర్మాణంలో మార్పులు చేయనున్నారు. టీఆర్ఎస్ పేరును భారత రాష్ట్ర సమితిగా (Bharatiya Rashtra Samiti) సీఎం కేసీఆర్ మంగళవారం రాత్రి ఫిక్స్ చేశారు. వందకుపైగా పేర్లు పరిశీలించిన అనంతరం ఈ పేరును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ జరిగే టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో ఈ పేరు మార్పుపై ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు. దీని కోసం ఈరోజు మధ్యాహ్నం 1:19 గంటలకు ముహూర్తం పెట్టారు.
ఈ సర్వసభ్య సమావేశానికి కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి, తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధ్యక్షుడు, ఎంపీ తిరుమవలవన్ తదితరులు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు. భారత్ రాష్ట్ర సమితి పేరు తెలుగు వారితో పాటు హిందీ వారికీ సులువుగా అర్థమవుతుందనే ఉద్ధేశంతో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ పేరు మార్పు చేసిన తీర్మానం ప్రతితో తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, పార్టీ తెలంగాణ భవన్ కార్యాలయ ఇన్‌ఛార్జి శ్రీనివాస్‌రెడ్డి గురువారం దిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర ఎలక్షన్ కమిషన్ ను కలిసి పార్టీ పేరు మార్పు చేసిన తీర్మానినికి ఆమోదం కోరూతు అఫిడవిట్ దాఖలు చేస్తారు.
Also Read: Hyderabad Traffic: భాగ్యనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..ఆ ప్రాంతాలకు వెళ్లొద్దని సూచనలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook