Telangana Corona cases: తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గురువారం సాయంత్రం 5.30 నుంచి శుక్రవారం సాయంత్రం 5.30 వరకు రాష్ట్రంలో 2,387 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది.
రాష్ట్రంవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 7,74,215గా ఉంది.
గడిచిన 24 గంటల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా చేసిన 79,561 టెస్టులకుగానూ.. ఈ కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే టెస్టుల సంఖ్య స్వల్పంగా తగ్గింది.
రికవరీలు ఇలా..
రాష్ట్రంలో రికవరీలు సైతం స్థిరంగా నమోదవుతూ వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల్లో 4,559 మంది కొవిడ్ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు ఆరోగ్య విభాగం వెల్లడించింది. ఇప్పటి వరకు 7,39,187 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో రికవరీల రేటు 95.48 శాతంగా ఉన్నట్లు తెలిపింది.
మరణాలు ఇలా..
కరోనాతో రాష్ట్రంలో తాజాగా ఒకరు మృతి చెందారు. దీనితో ఇప్పటి వరకు రాష్ట్రంలో కొవిడ్ మృతుల సంఖ్య 4,097 వద్దకు చేరింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.53 శాతంగా ఉంది.
తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 30,931 యాక్టివ్ కొవిడ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 3,24,63,138 కరోనా టెస్టులు చేశారు. ఈ మొత్తం రాష్ట్రంలోని ప్రతి పది లక్షల మందికి 8,72,196 టెస్టులతో సమానం.
Also read: TSRTC ప్రత్యేక బస్సుల్లో 50% అదనపు బాదుడు
Also read: Telangana High Court: తెలంగాణలో విద్యాసంస్థల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి