TS ECET 2024: టీఎస్ ఈసెట్ నోటిఫికేషన్ 2024 గానూ నోటిఫికేషన్ విడుదల చేసింది. టీఎస్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ ను ఈమేరకు ఉస్మానియా యూనివర్శిటీ విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు సంబంధిత వెబ్‌సైట్ లో క్షణ్నంగా చదివి దరఖాస్తు చేసుకోంది. ఈసెట్ ను ఏడవసారి జేఎన్‌టీయూహెచ్ తెలంగాణ నిర్వహిస్తోంది. ఇది పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష. డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమెటిక్స్) డిగ్రీ వారు బీఈ, బీటెక్, బీఫార్మాలో ప్రవేశాలకు గాను ఈ ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు.
టీఎస్ ఈసెట్ అధికారిక వెబ్సైట్ https://ecet.tsche.ac.in నోటిఫికేషన్ వివరాలు, సిలబస్, కోర్సుల జాబితా, ఆన్లైన్ అప్లికేషన్ విధానం, ఫీపేమెంట్ తదితరాలు ఇన్స్టక్షన్ బుక్లెట్ అందుబాటులో ఉన్నాయి.
ఇదీ చదవండి: MEA Recruitment 2024: విదేశీ మంత్రిత్వ శాఖ బంపర్ ఆఫర్.. పరీక్ష లేకుండా రూ.70,000 జీతంతో ఉద్యోగం..
TS ECET 2024 నోటిఫికేషన్..
రిజిస్ట్రేషన్ ప్రక్రియ రేపు అంటే 2024 ఫిబ్రవరి 15 నుంచి 2024 ఏప్రిల్ 16 వరకు దరఖాస్తు గడువు.
పరీక్ష తేదీ: 2024 మే 06
అర్హత..
ఈ దేశానికి చెందినవారై ఉండాలి
తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినవారు.
డిప్లొమా ఇంజినీరింగ్/ టెక్నాలజీ/ఫార్మసీ చదివి ఉండాలి. 45% మార్కులతో డిప్లొమా ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ, లేదా బీఎస్ఈ మ్యాథ్స్ పాసై ఉండాలి.
ఫీజు వివరాలు..
TS ECET దరఖాస్తు చేసుకునేవారు దరఖాస్తు రుసుము రూ.900 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ విద్యార్థులు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: మీరు డిగ్రీ పూర్తిచేసి బ్యాంకు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? మీకో సువర్ణవకాశం..
రిజిస్టర్ చేసుకునే విధానం..
tsche.website అధికారివ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
ఈ హోంపేజీలో అభ్యర్థులు 'TS ECET 2024 registrations' పై క్లిక్ చేయాలి.
అప్పుడు తదుపరి పేజీ ఓపెన్ అవుతుంది.
అప్లికేషన్లో వివరాలు నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించి ఫారమ్ సబ్మిట్ చేయాలి.
చివరగా అప్లికేషన్ ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోండి. ఏమైనా అప్డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్ నే సందర్శించండి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి