TSPSC Jobs: నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. అసెంబ్లీ సాక్షిగా ఆదేశాలు జారీచేసిన సీఎం రేవంత్ రెడ్డి..

Telangana: ఎన్నో ఏళ్ల నుంచి సర్కారు కొలువుల కోసం ఎదురు చూస్తున్న రేవంత్ రెడ్డికి మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే గ్రూప్ 1 పోస్టుల సంఖ్యను కూడా పెంచారు. అదే విధంగా తాజాగా, అసెంబ్లీ సమావేశం నేపథ్యంలో ఉద్యోగాల వయోపరిమితి విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 12, 2024, 05:44 PM IST
  • - నిరుద్యోగులకు మరో తీపికబురు..
    - త్వరలోనే భారీగా సర్కారు కొలువులు..
TSPSC Jobs: నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. అసెంబ్లీ సాక్షిగా ఆదేశాలు జారీచేసిన సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy Increased Age limit 46 Years: తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. దీనిలో భాగంగానే ఇప్పటికే అనేక శాఖలను ప్రక్షాళన చేసింది. ఇక నీళ్లు, నిధులు, నియమాకాల నినాదంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఇదిలా ఉండగా.. టీఎస్పీఎస్సీని పూరిస్థాయిలో ప్రక్షాళన చేశారు. అదే విధంగా మాజీ పోలీసుబాసు మహేందర్ రెడ్డిని ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ గా, మరికొందరిని సభ్యులుగా నియమించారు.

Read More: Yatra 2 Collections: యాత్ర 2 ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. జగన్ మూవీకి గట్టి షాక్ ఇచ్చిన ప్రేక్షకులు..

గత ప్రభుత్వం గ్రూప్ 1 ... పోస్టుల సంఖ్యకు, మరికొన్నిపోస్టులను యాడ్ చేసింది. ప్రస్తుతం గ్రూప్ 1 కు 563 పోస్టులు ఉన్నాయి. ఇక మరోవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పిటిషన్ ను ఉపసంహరించుకుంది. దీంతో నోటిఫికేషన్ కు లైన్ క్లియర్ అయ్యిందని చెప్పుకొవచ్చు.

ఇక మరో వైపు ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు వయోపరిమితి 44 ఉండేది. ఇప్పుడు దీన్ని 46 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. రెండేళ్లుగా ఎలాంటి నోటిఫికేషన్లు లేకుండా ఎదురుచూసిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

Read More: Sleeping: నిద్రలో మీకు తెలియకుండా ఆ పనిచేస్తున్నారా..?.. మీరు డెంజర్ లో ఉన్నట్లే అంటున్న నిపుణులు..

రెండు సంవత్సరాలను పెంచుతూ పాత నిబంధనలను పూర్తిగా సడలిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీంఎ రేవంత్ రెడ్డి  నిర్ణయం పట్ల నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైన ఎన్నో ఏళ్లుగా సర్కారు కొలువు కోసం రాత్రనక, పగలనక లైబ్రరీలు, స్టడీ హల్ లో, ఇంట్లో వాళ్లకు దూరంగా ఉండి చదువుకునే వారు.. సీఎం రేవంత్ నిర్ణయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x