Telangana Govt Hikes: ఉద్యోగులు.. పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. అలవెన్స్‌లు భారీగా పెంపు

Telangana Hikes Allowance for Govt: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు గుడ్‌న్యూస్. అలవెన్స్‌లను భారీ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా ఇల్లు కట్టుకునే వారికి ఇచ్చే అడ్వాన్స్‌ను కూడా పెంచింది.

Written by - Ashok Krindinti | Last Updated : Jun 25, 2023, 01:07 PM IST
Telangana Govt Hikes: ఉద్యోగులు.. పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. అలవెన్స్‌లు భారీగా పెంపు

Telangana Govt Hikes Allowance for Govt Employees: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు, పింఛనర్లకు ఇచ్చే అలవెన్స్‌ను పెంచుతూ విభాగాల వారీగా ఉత్తర్వులు జారీ చేసింది. జీవోలో పేర్కొన్న దాని ప్రకారం.. ఉద్యోగులకు ట్రావెలింగ్ అండ్ కన్వీనియన్స్ అలవెన్స్ 30 శాతం పెంచింది. బదిలీపై వెళ్లే ఉద్యోగులకు ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ 30 శాతం పెంచింది. సెలవురోజుల్లో పనిచేసే లిఫ్ట్ ఆపరేటర్లు, డైవర్లకు అదనంగా రూ.150 చెల్లించాలని నిర్ణయించింది. 

షెడ్యూల్ ఏరియాలో పనిచేసే ఉద్యోగులకు స్పెషల్ కాంపన్సెటరీ అలవెన్స్ 30 శాతం పెంచింది. దివ్యాంగ ఉద్యోగులకు ఇచ్చే కన్వీయన్స్ అలవెన్స్ రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచింది. ఇళ్లు నిర్మించుకునే వారికి ఇచ్చే అడ్వాన్స్ పరిమితిని రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచింది. కారు కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్ పరిమితిని రూ.6 లక్షల నుంచి 9 లక్షలకు పెంచింది. మోటార్ సైకిల్ కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్ 80 వేల నుంచి రూ.లక్షకు పెంచింది. ఉద్యోగుల పిల్లల పెళ్లిళ్లకు సంబంధించి, కుమార్తె పెళ్లికి ఇచ్చే అడ్వాన్స్ లక్ష నుంచి రూ.4 లక్షలు, కుమారుడి పెళ్లికి ఇచ్చే అడ్వాన్స్ రూ.75 వేల నుంచి రూ.3 లక్షలకు పెంచింది. 

స్టేట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్ ఉద్యోగులకు ఇచ్చే ఇన్సెంటివ్ 30 శాతం పెంచింది. గ్రేహౌండ్స్, ఇంటిలిజెన్స్, ట్రాఫిక్, సీఐడీ, ఆక్టోపస్, యాంటి నక్సలైట్ స్క్వాడ్ విభాగాల్లో పని చేసే పోలీసులకు ఇచ్చే స్పెషల్ పేస్‌ను 2020 పే స్కేల్ ప్రకారం వర్తింపజేస్తారని ప్రభుత్వం పేర్కొంది. పెన్షనర్లు చనిపోతే అందించే తక్షణ సాయం రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచింది. ప్రోటోకాల్ డిపార్ట్మెంట్‌లో విధులు నిర్వర్తించే అన్ని కేటగిరీల్లోని ఉద్యోగులకు అదనంగా 15 శాతం స్పెషల్ పే మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విభాగాల వారీగా ఉత్వర్వులు జారీ చేసింది.

Also Read: Titanic Submarine: చివరికి విషాదాంతం.. టైటాన్ సబ్‌మెరైన్‌లో ఐదుగురు మృతి

కాగా ఇటీవలె ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్ పేపై 2.73% డీఏ విడుదలకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. పెన్షనర్లకు కూడా వారి పెన్షన్‌పై 2.73 శాతం డియర్‌నెస్ రిలీఫ్ లభించనుంది. జూన్ నెల నుంచే అమల్లోకి తీసుకువస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.  జూలై నెలలో వేతనంతో కలిపి చెల్లిస్తామని తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో రూ.1380.09 కోట్ల అరియర్స్ చెల్లింపుతో ఏడాదికి రూ.974.16 కోట్ల అదనపు భారం పడనుంది. తాజాగా అలవెన్స్‌లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Underwater Metro: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలోనే భారత్‌లో అండర్ వాటర్ మెట్రో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News