తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా

తెలంగాణలోమరోసారి వాయిదాపడిన ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు

Last Updated : May 20, 2019, 09:40 PM IST
తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు మరోసారి వాయిదాపడ్డాయి. ఈనెల 25వ తేదీ నుంచి జరగాల్సిన ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. కొత్తగా రూపొందించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 7 నుంచి 14 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డ్ అధికారులు తెలిపారు. 

ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌ను జూన్ 15 నుంచి 18వ తేదీ వరకు జరుగుతాయని ఇంటర్ బోర్డ్ స్పష్టంచేసింది.

Trending News