Sircilla Collector: రాజకీయ సభల్లో అధికారులపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ సిరిసిల్ల జిల్లా కలెక్టర్ తీరును కూడా కేటీఆర్ తప్పుబట్టారు. ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ కలెక్టర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా కాంగ్రెస్ పార్టీ తిప్పి కొడుతుండగా.. ఐపీఎస్ అధికారులు రంగంలోకి దిగారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఐపిఎస్ అధికారుల సంఘం ఖండించింది. కేటీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఐపీఎస్ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇది చదవండి: Harish Rao: రేవంత్ రెడ్డి 'ఆ పని' చేస్తే పూలబోకే ఇచ్చి థాంక్స్ చెప్తా: హరీశ్ రావు
సిరిసిల్ల పర్యటనలో కలెక్టర్‌పై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'సన్నాసి ఒకడు కలెక్టర్ వచ్చాడు. కాంగ్రెస్ కార్యకర్త ఒకరు వచ్చి కలెక్టర్ రూపంలో కూర్చున్నాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా పని చేస్తున్న వారిని వడ్డీతో సహా చెల్లించుకుంటా' అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా కలెక్టర్‌పై మాజీ మంత్రి కె తారక రామారావు చేసిన అవమానకరమైన, నిరాధార ఆరోపణలను తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. సివిల్ సర్వీస్ అధికారిపై చేసిన విమర్శలు ఆయన నిష్పక్షపాతం, విశ్వసనీయతను ప్రశ్నించేలా ఉన్నాయని అధికారుల సంఘం పేర్కొంది. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పాలన విధానాలు, రాజ్యాంగ నిబద్ధత ఆధారంగా విధులు నిర్వర్తించే బాధ్యతలకు విరుద్ధంగా ఉన్నాయని తప్పుబట్టింది.
ఇది చదవండి: Kalyana Lakshmi: 'తులం బంగారం ఏది?' అంటూ మహిళ నిలదీత.. ఖంగుతిన్న ఎమ్మెల్యే
'ప్రజాసేవలో అధికారి విధులను నిష్పక్షపాతంగా.. న్యాయబద్ధంగా.. ఎటువంటి భయాందోళనలు లేకుండా నిర్వహించాల్సి ఉంటుంది. ఊహించని ఇటువంటి నిరాధార ఆరోపణలు బాధ్యతారాహిత్యమైనవిగా, ప్రజాస్వామ్య వ్యవస్థలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి' అని ఐపీఎస్‌ల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌కు తమ పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం వెల్లడించింది. సివిల్ సర్వీసు అధికారుల గౌరవం, స్వతంత్రత, నిష్పక్షపాతాన్ని కాపాడటానికి తాము అండగా నిలబడతామని స్పష్టం చేసింది. కలెక్టర్ విధి నిర్వహణ సామర్థ్యాన్ని దెబ్బతీయడంతో పాటు, పాలన పట్ల ప్రజల నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తాయని కేటీఆర్‌కు గుర్తు చేసింది. నిరాధార ఆరోపణలను వెంటనే నిలిపివేయాలని కేటీఆర్‌కు తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం విజ్ఞప్తి చేసింది. వ్యవస్థల గౌరవాన్ని.. రాజ్యాంగం ద్వారా కల్పించిన న్యాయబద్ధతను గౌరవించేలా వ్యవహరించాలని పేర్కొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.