బీజేపీ ఓటమిపై కేటీఆర్ హాట్ సెటైర్లు

Last Updated : Mar 15, 2018, 11:12 AM IST
బీజేపీ ఓటమిపై కేటీఆర్ హాట్ సెటైర్లు

యూపీ,బీహార్ ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని ట్విట్టర్ లో తన అభిప్రాయన్ని వెల్లడించారు. యూపీలో సీఎం, డిప్యూటీ సీఎంల సొంత నియోజకవర్గాల్లో ప్రతిపక్షాలు గెలవడం వంటి పరిణామాలు చూస్తుంటే ఏది శ్వాశ్వతం కాదని విషయం తేటతెల్లమైందని వ్యాఖ్యానించారు. ఇవే ఎన్నికల్లో జాతీయపార్టీ అని చెప్పుకుంటున్న ఓ పెద్ద పార్టీకి డిపాజిట్లు రాకపోవడం హాస్యాస్పందంగా ఉందని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి విమర్శించారు. ఈ ఫలితాల్లో ప్రజల స్టాండ్ ఎలా ఉంటుందో అన్ని పార్టీలకు తెలిసి వచ్చిందన్నారు. తాము ఎవరికి కొమ్మకాయమని.. నచ్చిన వారికి ఓటు వేస్తాం..పనిచేయకపోతే ఎవరినైనా బయటకు గెంటేస్తామనే మెసేజ్ ను ప్రజలు ఇచ్చారని కేటీఆర్ అన్నారు. కాగా ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

 

Trending News