ఓయూ prof డాక్టర్ చింతకింది కాశిం అరెస్ట్

మావోయిస్టు సానుభూతిపరులతో ఉన్న అనుబంధంపై శనివారం ఉదయం ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ చింతకింది కాశిం నివాసాన్ని తెలంగాణలోని జోగులాంబా గద్వాల్ జిల్లాకు చెందిన పోలీసు బృందం, రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం సహాయంతో క్యాంపస్ 

Last Updated : Jan 18, 2020, 06:05 PM IST
ఓయూ prof డాక్టర్ చింతకింది కాశిం అరెస్ట్

హైదరాబాద్: మావోయిస్టు సానుభూతిపరులతో ఉన్న అనుబంధంపై శనివారం ఉదయం ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ చింతకింది కాశిం నివాసాన్ని తెలంగాణలోని జోగులాంబా గద్వాల్ జిల్లాకు చెందిన పోలీసు బృందం, రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం సహాయంతో క్యాంపస్ వద్ద గల నివాసాన్ని చుట్టుముట్టాయి.  

విప్లవ రచయితల సంఘం (విరసం) కార్యదర్శిగా డాక్టర్ కాశిం ఇటీవల ఎన్నికైన నేపథ్యంలో, అంతేకాకుండా 2018లో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరావుకు కాశిం దగ్గరి సహచరుడు కావడం కారణంగానే అరెస్టు చేసి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. 

పోలీసు డ్రెస్సులతో, సివిల్ దుస్తులలో కనీసం 20 మంది పోలీసులు ఇంట్లో సోదాలు చేసి డాక్టర్ కాశింను ప్రశ్నించారని చెప్పారు. కాశిం ఇంటి ముట్టడి విషయం విద్యార్థులకు తెలియగానే అక్కడకు చేరుకున్నారు. దీంతో పోలీసు అధికారులు  అదనపు బలగాలను మోహరింపజేశారు. 

అరెస్టు చేసిన డాక్టర్ కాశిం వద్దనుండి కంప్యూటర్ హార్డ్ డిస్క్, సాహిత్యపరమైన పుస్తకాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో మావోయిస్టు భావజాల వ్యాప్తిని పెంపొందిస్తున్నారని యువతను, విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News