SI and Constable Preliminary Exam Result 2022: తెలంగాణలో ఇటీవల నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చేశాయి. ఈ మేరకు పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఫలితాలను విడుదల చేసింది. సివిల్ ఎస్సై ప్రిలిమ్స్ లో 46.80 శాతం, సివిల్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ లో 31.40 శాతం, ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ పరీక్షలో 44.84 శాతం, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ లో 43.65శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. అభ్యర్థులు తమ రిజల్ట్స్ ను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://www.tslprb.in లో చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 554 ఎస్‌ఐ పోస్టులకు ఆగస్టు 7న ప్రిలిమనరీ పరీక్ష నిర్వహించింది. అనంతరం 15,644 కానిస్టేబుల్, 63 ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్, 614 ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్ పోస్టులకు ఆగస్టు 28న రాత పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు మెుత్తం 6,61,198 మంది అప్లై చేసుకోగా... పరీక్షలకు 6,03,955(91.34 శాతం) మంది హాజరయ్యారు. టీఎస్ఎల్పీఆర్బీ నిర్వహించిన ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల కటాఫ్ మార్కులను ప్రభుత్వం రీసెంట్ గా సవరించింది. 200 మార్కులకు గాను ఓసీలకు 60, బీసీలకు 50, ఎస్సీ, ఎస్టీలకు 40 మార్కులుగా నిర్దారించింది. గతంలో ఓసీలకు 80, బీసీలకు 70, ఎస్సీ, ఎస్టీలకు 60 మార్కులుగా ఉండేవి.
ప్రిలిమ్స్ ఉత్తీర్ణులై ఫిజికల్ టెస్టులకు అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 27 ఉదయం 8 నుంచి నవంబర్ 10 రాత్రి 10 గంటల్లోగా పార్ట్-2 దరఖాస్తును అప్‌లోడ్ చేయాలని టీఎస్‌ఎల్పీఆర్బీ చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు.
Also 'read: Munugode Bypoll: మునుగోడు ఓటర్లకు 'దీపావళి' ధమాకా ఆఫర్‌లు.. స్వీట్లు, టపాసులు, చీరలతో పాటు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook