ఢిల్లీలో జాతీయ సదస్సుకు హాజరైన క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస గౌడ్

జాతీయ సదస్సుకు మంత్రి శ్రీనివాస గౌడ్

Updated: Nov 15, 2019, 12:37 PM IST
ఢిల్లీలో జాతీయ సదస్సుకు హాజరైన క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస గౌడ్

న్యూఢిల్లీ: విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర క్రీడా, యువజన వ్యవహారాలు శాఖ ఆధ్వర్యంలో నేడు జరుగుతున్న జాతీయ సదస్సుకు అన్ని రాష్ట్రాల క్రీడా శాఖ మంత్రులు, సంబంధిత శాఖ కార్యదర్శులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి ఈ సదస్సుకు హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. అక్కడ కేంద్ర క్రీడా శాఖ మంత్రి శ్రీ. కిర‌ణ్ రిజిజును సన్మానించి జ్ఞాపికను అందజేశారు. 

దేశం నలుమూలల నుంచి క్రీడలు, వివిధ విభాగాల్లో యువతకు ప్రాతినిథ్యం కల్పించి వారికి జాతీయ స్థాయిలో గుర్తింపు, ప్రోత్సాహం లభించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై చర్చించే లక్ష్యంతోనే ఈ జాతీయ సదస్సు ఏర్పాటు చేసినట్టు సదస్సుకు హాజరైన ప్రతినిధులు తెలిపారు. 2022లో బర్మింగ్‌హమ్‌లో జరగనున్న కామన్‌వెల్త్ గేమ్స్‌కి వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులను సన్నద్ధం చేయాల్సిన తీరుపై సైతం ఈ సదస్సులో ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది.