గత అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి విఫలమైన నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ -టీజేఎస్ పార్టీలు విడివిడిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో టీజేఎస్ రెండు లేదా మూడు లోక్ సభ స్థానాల్లో మాత్రమే బరిలోకి దిగుతోంది.
ఇక మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు టీజేఎస్ చీఫ్ కోదండరాం ప్రకటించారు. రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం కోదండరాం ఈ మేరకు ప్రకటన చేశారు
ఇదే సందర్భంలో మల్కాజ్ గిరి లోక్ సభ స్థానంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్ధి రేవంత్ రెడ్డికి మద్దతిచ్చే అంశంపై జిల్లా కమిటీనిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కోదండరాం తెలిపారు.