COVID-19 Updates : కరోనాతో రాష్ట్రంలో మరో నలుగురు మృతి

లాక్‌డౌన్ సడలింపుల ( Lockdown guidelines) అనంతరం కరోనావైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతుండటం ఆందోళనరేకెత్తిస్తోంది. తెలంగాణలో మంగళవారం కొత్తగా 42 కరోనావైరస్ పాజిటివ్ కేసులను ( Coronavirus positive cases ) గుర్తించగా అందులో జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోవి 34 కాగా.. వలస కార్మికులు 8 మంది ఉన్నారు.

Last Updated : Jun 25, 2020, 02:44 AM IST
COVID-19 Updates : కరోనాతో రాష్ట్రంలో మరో నలుగురు మృతి

హైదరాబాద్: లాక్‌డౌన్ సడలింపుల ( Lockdown guidelines) అనంతరం కరోనావైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతుండటం ఆందోళనరేకెత్తిస్తోంది. తెలంగాణలో మంగళవారం కొత్తగా 42 కరోనావైరస్ పాజిటివ్ కేసులను ( Coronavirus positive cases ) గుర్తించగా అందులో జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోవి 34 కాగా.. వలస కార్మికులు 8 మంది ఉన్నారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,634కు ( Total COVID-19 positive cases) చేరింది. వీరిలో 77 మంది వలస కూలీలు ఉన్నట్టుగా మంగళవారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ( Also read : ఆగస్టు 3 నుంచి స్కూళ్లు పునః ప్రారంభం )
కరోనా కారణంగా మంగళవారం నలుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 38కి చేరింది. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఇవాళ కరోనా నుంచి కోలుకున్న 9 మందిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,011 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 585 యాక్టివ్ కేసులు ( Total active cases in Telangana ) ఉన్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News