మహేష్ సందేశంపై ఎంపీ కవిత ట్వీట్

టీఆర్ఎస్ ఎంపీ కవిత చేపట్టిన  'సిస్టర్‌ ఫర్‌ ఛేంజ్‌'పై హీరో మహేష్ బాబు స్పందించారు.

Updated: Aug 10, 2018, 11:41 AM IST
మహేష్ సందేశంపై ఎంపీ కవిత ట్వీట్

టీఆర్ఎస్ ఎంపీ కవిత చేపట్టిన  'సిస్టర్‌ ఫర్‌ ఛేంజ్‌'పై హీరో మహేష్ బాబు స్పందించారు. ప్రజల్లోకి ఈ స్లోగన్‌ను తీసుకెళ్లేందుకు ఓ వీడియోను గురువారం పోస్టు చేశారు. హెల్మెట్ పెట్టుకోకపోవడంతో దేశంలో రోజుకు 28మంది చనిపోతున్నారని.. రాఖీ పండగ రోజున అక్కాచెల్లెళ్లు తన సోదరులకు ఓ హెల్మెట్‌ను కానుకగా ఇవ్వాలని కోరారు. వాహన దారులు తన ప్రాణాలు కాపాడుకుంటే వారి కుటుంబం ఆనందంగా ఉంటుందని చెప్పారు. కాగా మహేష్ ఇచ్చిన ఈ మెసేజ్‌కు రెస్పాన్స్ బాగానే వచ్చింది.

రాఖీ పౌర్ణమి రోజున సోదరులకు అక్కాచెల్లెళ్లు హెల్మెట్‌ ను గిఫ్ట్ గా ఇవ్వాలని ఎంపీ కవిత గతంలో సందేశం ఇచ్చారు. అందులో భాగంగా ఎంపీ కవిత చేపట్టిన 'సిస్టర్‌ ఫర్‌ ఛేంజ్‌' కార్యక్రమానికి మహేష్ మద్దతు పలికారు. దీనిపై ఎంపీ కవిత హర్షం వ్యక్తం చేశారు. మహేష్‌కు పుట్టిన రోజు విషెష్ చెబుతూ.. సిస్టర్స్‌ ఫర్‌ చేంజ్‌ కార్యక్రమానికి బాసటగా నిలిచినందుకు ధన్యవాదాలు చెబుతూ.. మహేష్‌ మాట్లాడిన వీడియోను పోస్ట్‌  ఎంపీ కవిత ట్వీట్ చేశారు.